Movie News

సినిమాలను కమ్మేస్తున్న పొలిటికల్ హీట్

ఏపీ ఎన్నికలకు ఇంకా నెలన్నర దాకా టైం ఉన్నప్పటికీ ఎలక్షన్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. రెండు రోజుల క్రితం టిడిపి జనసేన పొత్తుకు సంబంధించిన సీట్ల ప్రకటన జరిగినప్పటి నుంచి ఒక్కసారిగా అభిమానుల అటెన్షన్ అటువైపు వెళ్లిపోయింది. పవన్ ఇంకా ఎక్కువ టికెట్లు డిమాండ్ చేసుండాల్సిందని ఒక వర్గం, తెలుగుదేశం కొన్ని కీలక స్థానాలు త్యాగం చేసి జనసేనకు ప్రాధాన్యత ఇచ్చిందని ఇంకో వర్గం ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్థమవుతున్నాయి. ఇరు వైపులా పాజిటివ్ నెగటివ్ రెండు రకాల కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగనుంది.

అసలే ఫిబ్రవరి నెల డ్రైగా గడిచిపోవడం పట్ల బయ్యర్లు దిగులుగా ఉన్న టైంలో ఇలా రాజకీయాల గురించి ఫోకస్ పెరగడం మరింత ఆందోళన కలిగించేదే. తెలంగాణలో వీటి ప్రభావం లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల వారీగా మీటింగులు, ర్యాలీలు, అసంతృప్తుల సమావేశాలు ఒకటేమిటి ఎక్కడ చూసినా ఇదే హడావిడి కనిపిస్తోంది. అధికార పార్టీ వైసిపి సైతం సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నలుగురు కలిసి టీ బంకు దగ్గర గుమికూడితే చాలు వాళ్ళ మధ్య సినిమాల కంటే స్థానిక పాలిటిక్స్ గురించిన టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఆశ్చర్యం కాదు.

దీని వల్ల కలెక్షన్లు అమాంతం తగ్గిపోతాయని కాదు కానీ ప్రభావమైతే ఖచ్చితంగా ఉంటుంది. ఖాళీగా ఉన్న యువతను పార్టీలు వాడుకునేందుకు చూస్తాయి. తాత్కాలికంగా ఆదాయ మార్గాలు చూపిస్తాయి. అలాంటప్పుడు థియేటర్లకు అదే పనిగా వెళ్లే శాతం తగ్గిపోతుంది. పైగా పిల్లల పరీక్షల దెబ్బకు పెద్దలు నో సినిమా బోర్డు పెట్టేసుకున్నారు. సో మార్చి రెండో వారం దాకా ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆపరేషన్ వాలెంటైన్, గామి, భీమాలు ఏదైనా అద్భుతం చేస్తేనే మళ్ళీ థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. లేదంటే ఎన్నికల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది.

This post was last modified on February 26, 2024 5:22 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago