Movie News

వర్మకు వాళ్లిస్తున్న విలువ ఇది

బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాల్లో రంగీలా ఒక‌టి. ఈ సినిమా విడుద‌లై 25 ఏళ్ల‌యింది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి మంచి మంచి క‌థ‌నాలు ఇస్తోంది. టీవీలు, వెబ్ సైట్లు, వీడియో ఫ్లాట్ ఫామ్స్‌లో కూడా ఈ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెబుతున్నారు.

ఆ సినిమా తాలూకు నోస్టాల్జిక్ మూమెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు. లెజెండ‌రీ సినిమాలు ఇలా మైల్ స్టోన్ మార్క్‌ను అందుకున్న‌పుడు మీడియా దాన్ని సెల‌బ్రేట్ చేయ‌డం మామూలే. ఐతే రంగీలా సినిమా సంబ‌రాల్లో ఎక్క‌డా దాని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పేరు క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఈ చిత్ర ఆర్టిస్టుల‌తో మాట్లాడుతున్నారు, ఇత‌ర టెక్నీషియ‌న్ల‌తో మాట్లాడుతున్నారు. వారి అనుభ‌వాల‌ను ఇస్తున్నారు. కానీ ఎవ్వ‌రూ వ‌ర్మ‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఒక సినిమా క్లాసిక్‌గా నిలిచిందీ అంటే.. అందులో మేజ‌ర్ క్రెడిట్ ద‌ర్శ‌కుడికే వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మైల్ స్టోన్ మార్కును అందుకున్న‌పుడు క‌చ్చితంగా ద‌ర్శ‌కుడినే ముందు మీడియా సంప్ర‌దిస్తుంది. అత‌నెలా ఈ సినిమాను తీర్చిదిద్దాడో అనుభ‌వాలు రాబ‌డుతుంది. ఆ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నాన్ని పొగుడుతారు. కానీ వ‌ర్మ విష‌యంలో అలా జ‌ర‌గ‌ట్లేదు. ఇదేమీ తొలిసారి కాదు. ఇంత‌కుముందు స‌త్య సినిమా విడుద‌లై 20 ఏళ్లు పూర్త‌యిన‌పుడు కూడా ఇలాగే జ‌రిగింది.

ఆ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేసిన వాళ్ల‌తో ఇంట‌ర్వ్యూలు చేసింది బాలీవుడ్ మీడియా. వ‌ర్మ‌ను మాత్రం ప‌ట్టించుకోలేదు. అత‌డు తీసిన సినిమాను పొగుడుతూ.. త‌న‌ను మాత్రం విస్మ‌రించింది. ఒక ద‌శ దాటాక నాసిర‌కం సినిమాలు తీయ‌డం, అన‌వ‌స‌ర వివాదాల్లో త‌ల‌దూర్చి స్థాయి త‌గ్గించుకోవ‌డంతో వ‌చ్చిన స‌మ‌స్య ఇది. ఇప్ప‌టికైనా తాను ఏ స్థితికి ప‌డిపోయానో వ‌ర్మ‌కు అర్థ‌మ‌వుతుందా?

This post was last modified on September 10, 2020 11:20 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

18 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago