ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అర్జున్ రెడ్డి ఛాయల్లో ఉందనే ప్రచారానికి గురైన సిద్దార్థ్ రాయ్ నిన్న విడుదలయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మీద దర్శకుడు యశస్వి చేసిన తీవ్ర ఆరోపణలు ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. సరే ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందినా కంటెంట్ బాగుంటే జనాలు ఎలాగూ ఆదరిస్తారు కాబట్టి ఆ నమ్మకంతోనే చిన్న సినిమాల భారీ పోటీ మధ్య థియేటర్లలో అడుగు పెట్టించారు. స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించిన దీపక్ సరోజ్ కి ఇది డెబ్యూ మూవీ. హీరోయిన్ తన్వి నేగి కూడా కొత్తమ్మాయే. ఇంతకీ సిద్దార్థ్ రాయ్ ఎలా ఉన్నాడు.
చిన్నప్పుడే విపరీతంగా వేల పుస్తకాలు చదివిన సిద్దార్థ్ రాయ్(దీపక్ సరోజ్)కు ఎమోషన్స్ ఉండవు. లాజిక్స్ తో బ్రతుకుతాడు. కేవలం తిండి, నిద్ర, సెక్స్ ఉంటే చాలని మెకానికల్ గా బ్రతుకుతూ ఉంటాడు. మహా మేధావి అయినప్పటికీ ఇతని ప్రవర్తన అందరిని ఇబ్బందుల పాలు చేస్తుంది. కాలేజీలో పరిచయమైన ఇందు(తన్వి నేగి) ప్రేమలో పడ్డాక సిద్దు జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. దీని వల్ల భావోద్వేగాలు మితిమీరి హద్దులు దాటడం మొదలుపెడతాడు. దీంతో ఇందు దూరమై పిచ్చివాడిగా మారతాడు. వీళ్ళను కలపాలని చూసిన ఓ పోలీస్ ఆఫీసర్ చివరికి ఏం చేశాడనేది కథ.
దర్శకుడు యశస్వి రాసుకున్న స్టోరీ అవసరానికి మించిన లాజిక్స్ రాత, ఎమోషన్ల మోత ఎక్కువైపోవడంతో విపరీతమైన అగ్రెసివ్ నెస్ తో సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో పాత్ర ఎంత అతి చేస్తే అంత బాగా యూత్ కి రిజిస్టర్ అవుతుందన్న నమ్మకంతో కథనాన్ని పూర్తిగా ట్రాక్ తప్పించేసింది. మోతాదు మించిన బోల్డ్ సీన్స్, సిద్దు క్యారెక్టర్ చేసే ఓవరాక్షన్ కు తోడు ఫిలాసఫీ పేరుతో యశస్వి తీసుకున్న క్లాసులు ఒకదశ దాటాక చిరాకు పెట్టిస్తాయి. దీపక్ కష్టం కనిపిస్తుంది కానీ తనే పూర్తిగా నప్పలేదు. తన్వి లుక్స్, యాక్టింగ్ పర్వాలేదు. థియేటర్ ని బోర్ కొట్టే క్లాస్ రూమ్ గా మార్చిన సిద్దార్థ్ రాయ్ చాలా ఓపికను డిమాండ్ చేస్తాడు
This post was last modified on February 24, 2024 10:49 am
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఎదురుకున్న ఇబ్బందులు, వేరొకరితో నేపధ్య సంగీతం…
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం.. నాలుగు రోజులు కూడా తిరగక ముందే బుట్టదాఖలైంది. ఇది…
ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు…