హీరోగా మాస్ మార్కెట్ ని ఎంజాయ్ చేస్తూనే ఇంకోవైపు కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే ఉద్దేశంతో రవితేజ మొదలుపెట్టిన బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు పెద్ద స్ట్రోక్ ఇస్తున్నాయి. రావణాసురలోనూ మాస్ రాజా నిర్మాణ భాగస్వామిగా ఉన్నప్పటికీ సోలో ప్రొడ్యూసర్ గా చూడాల్సింది మాత్రం ఛాంగురే బంగారురాజా నుంచే. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు అధిక శాతం కమెడియన్లను క్యాస్టింగ్ గా పెట్టుకుని తీసిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. కంటెంట్ లో చెప్పుకోదగ్గ పాయింట్ ఉన్నా పేలవమైన రైటింగ్, డైరెక్షన్ తో డిజాస్టరయ్యింది.
తాజాగా సుందరం మాస్టర్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. టాక్ ఆశాజనకంగా లేదు. దీనికన్నా ముందు అసలు పబ్లిక్ ఈ సినిమా మీద ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని మార్నింగ్ షో జనాలను చూస్తేనే అర్థమైపోయింది. హర్ష చెముడుని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన మంచిదే కానీ కథా కథనాల విషయంలో ఎంటర్ టైన్మెంట్ కన్నా ఎక్కువగా సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్ సహనానికి పరీక్ష పెట్టి ఓడించేసింది. ఈ వీకెండ్ లో ఏదైనా రాబడితేనే అదే గొప్పనుకోవాలి తప్పించి సోమవారం నుంచి అగ్ని పరీక్షే ఉంటుంది.
డబ్బుల పరంగా రవితేజకు వీటివల్ల పెద్దగా రిస్క్ ఏం లేదు. డబ్బింగ్, శాటిలైట్ ఇలా ఏదో ఒక రూపంలో పెట్టుబడి వెనక్కు వస్తుంది. కానీ బ్రాండ్ ఇమేజ్ కూడా ముఖ్యం కదా. రవితేజ ప్రొడక్షన్ అంటే అభిమానుల్లోనే కాదు సగటు మూవీ లవర్స్ లోనూ ప్రత్యేక గౌరవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చాలా ముఖ్యం. అలా అని బ్యాడ్ మూవీస్ తీయలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూరే పరిగణనలోకి వస్తుంది. అసలే హీరోగా రవితేజనే వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటిది ఇలా నిర్మాణ పరంగానూ కాలం కలిసి రాకపోవడం దురదృష్టం. ఇకనైనా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి.
This post was last modified on February 24, 2024 10:45 am
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…