ఇవాళ విడుదలైన కొత్త సినిమాల్లో హర్ష చెముడు హీరోగా నటించిన సుందరం మాస్టర్ ఒకటి. చిన్న చిత్రాలను, కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ కు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. కమెడియన్ గా మెప్పిస్తూ వచ్చిన హర్షని కథానాయకుడిగా ప్రేక్షకులు స్వీకరిస్తారా లేదానే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో ఎక్కువగానే ఉంది. ఓపెనింగ్స్ మీద పెద్ద ఆశలేం లేకపోయినా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారనే నమ్మకంతో టీమ్ సాహసం చేసింది. మరి సుందరం మాస్టర్ ఎలా ఉన్నాడు.
లైన్ పరంగా కథ డిఫరెంటే. మిర్యాలమెట్ట అనే అటవీ ప్రాంతపు ఊరి జనం నాగరికతకు దగ్గరగా అనాగరిక ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. ఆ గ్రామానికి ఒక ఇంగ్లీష్ టీచర్ అవసరమని గుర్తించిన లొకల్ ఎమ్మెల్యే(హర్షవర్షన్) ప్రమోషన్ ఇప్పించే సాకుతో సుందరం (హర్ష చెముడు)ని అక్కడికి పంపిస్తాడు. దాని వెనుక ఇంకో రహస్య ఉద్దేశం కూడా ఉంటుంది. తీరా అక్కడికి వెళ్లిన సుందరంకి తన కంటే గూడెం జనాలకే ఆంగ్లం బాగా వస్తుందని గుర్తించి షాక్ తింటాడు. మరి ఏ కారణంతో సుందరంని వాళ్ళు రప్పించుకున్నారు, పెళ్లి కాని అతని లక్ష్యం ఏ గమ్యం చేరుకుందనేది అసలు పాయింట్
దర్శకుడి ఉద్దేశం, చెప్పాలనుకున్న సందేశం, ఫస్ట్ హాఫ్ లో ఓ మోస్తరుగా వినోదాన్ని మేళవించిన తీరు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ అవసరానికి మించి మెసేజులు, ఫిలాసఫీల జోలికి వెళ్లడంతో కథనం ఫ్లాట్ గా మారిపోయి ఆసక్తిని తగ్గించేస్తుంది. ఆరిస్టులు బాగానే కుదిరినా కన్విన్స్ చేసేలా స్క్రీన్ ప్లే కుదరలేదు. కొన్ని సీన్లు లాజిక్ కి దూరంగా నడిపించారు. అసలు ఆ ఊరి సెటప్, గాంధీజీ ఇంకా ఉన్నారనే భ్రమలో వాళ్ళను చూపించడం లాంటి ఎన్నో అంశాలు ఏ మాత్రం అతకలేదు. ఇంగ్లీష్ పాఠాలు బోధించడంలో చూపించిన శ్రద్ధ వినోదంపై కూడా పెట్టి ఉంటే సుందరం మాస్టర్ పాసయ్యేవాడు. కానీ ఛాన్స్ మిస్.
This post was last modified on February 23, 2024 11:31 pm
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన అఖిల పక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వచ్చారు. తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి,…
నిర్మాత దిల్ రాజు సుడి కొత్త సంవత్సరంలో మహా భేష్షుగా ఉంది. గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్…
ఇంకుడు గుంత, పంట కుంట... వీటి పేర్లు వేరైనా...వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు…
ఎన్నో సినిమాలకు పని చేసినప్పటికీ రచయితలుగా సామజవరగమనతో గుర్తింపు తెచ్చుకున్న భాను - నందులో భాను భోగవరపు త్వరలో విడుదల…
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసమంటూ తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకే శనివారం ఓ…
చామకూర మల్లారెడ్డి... నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి... ఆ తర్వాత…