ఇవాళ పెద్ద ఎత్తున కొత్త రిలీజులు థియేటర్లకు వచ్చాయి. అయిదారు స్క్రీన్లున్న మల్టీప్లెక్సులకు సైతం ఢోకా లేకుండా సినిమాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కట్ చేస్తే ఓపెనింగ్స్ కనిపించడం లేదు. హర్ష చెముడు టైటిల్ రోల్ పోషించిన సుందరం మాస్టర్ కు మెయిన్ సెంటర్స్ లో ఓ మోస్తరుగా జనం వస్తే మిగిలిన సెంటర్లలో మాత్రం పికప్ కాకపోతే కష్టమనేలా ఉంది. అభినవ్ గోమటంని హీరోగా మార్చిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా పరిస్థితి ఇంతకన్నా అన్యాయంగా ఉంది. ప్రమోషన్లు జనాలకు అంతగా రీచ్ కాకపోవడంతో ఇదొచ్చిందన్న సంగతే పెద్దగా తెలియలేదు.
విపరీతమైన క్యారెక్టరైజేషన్ తో అర్జున్ రెడ్డి రేంజ్ లో హడావిడి చేసిన సిద్దార్థ్ రాయ్ ఆడియన్స్ ని రప్పించేందుకు పోరాడుతున్నాడు. దర్శకుడు యశస్వి చాలా కొత్తగా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రాధమిక రిపోర్ట్స్ మాత్రం మిక్స్డ్ గానే ఉన్నాయి. మమ్ముట్టి భ్రమ యుగం మీద ఆశలు పెట్టుకున్న హారర్ లవర్స్ మలయాళం హిట్ టాక్ తెలిసిపోయింది దీనికి మాత్రం ప్రత్యేకంగా వెళ్లిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అలా అని హౌస్ ఫుల్ బోర్డులు లేవు కానీ డీసెంట్ ఫిగర్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇవి కాకుండా మరో నాలుగు సినిమాలు గురించి చెప్పుకోకపోవడం బెటర్.
అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో హైప్ లేకపోవడం సమస్యగా మారింది. ఆ మాటకొస్తే సంక్రాంతికి తిరిగి అంత ఊపు తెచ్చిన సినిమాలేవీ బాక్సాఫీస్ ని పలకరించలేదు. ఊరుపేరు భైరవకోన ఒకటే డీసెంట్ గా నడుస్తుండగా, ఈగల్ రెండో వారానికే నెమ్మదించిపోయింది. ఇక యాత్ర 2, లాల్ సలాంల గురించి తెలిసిందే. పైన చెప్పిన సినిమాలకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోయినా ఇవాళ సాయంత్రానికి లేదా రేపటికి పర్వాలేదు చూడొచ్చనే మాట తెచ్చుకుంటే వీకెండ్ కి పుంజుకోవచ్చు. మొదటి రోజు మార్నింగ్ షోకే జనాలు పల్చగా ఉంటే అదే కదా అసలు సమస్య.
This post was last modified on February 23, 2024 3:49 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…