దేవర తప్పుకోవడంతో ఏప్రిల్ 5 లాంటి మంచి డేట్ ని పట్టేసిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలకు నలభై రెండు రోజులు మాత్రమే సమయముంది. షూటింగ్ కి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. కొంత కీలక భాగం పెండింగ్ ఉందట. వచ్చే నెల రెండో వారం లోపు మొత్తం పూర్తి చేయకపోతే ప్రమోషన్ల పరంగా ఇబ్బందవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేని డెడ్ లైన్ తో దర్శకుడు పరశురామ్ టీమ్ ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే వచ్చిన నంద నందన లిరికల్ సాంగ్ జనంలోకి బాగా వెళ్లడంతో మిగిలిన పాటల మీద ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది.
బిజినెస్ వర్గాల్లో ది ఫ్యామిలీ స్టార్ మీద మంచి అంచనాలున్నాయి. సరైన కథ పడటమే ఆలస్యం కానీ అది కుదిరితే మాత్రం విజయ్ దేవరకొండ ప్రేక్షకులను రప్పించగలడు. ఖుషి యావరేజ్ కాకపోయి ఉంటే గీత గోవిందంని దాటే ఛాన్స్ ఉండేదన్న కామెంట్లో నిజం లేకపోలేదు. అందుకే ఫ్యామిలీ స్టార్ కి మంచి పబ్లిసిటీ ఇవ్వాలనే ప్రణాళికతో ఉన్నారు దిల్ రాజు. అసలే వారం ముందు టిల్లు స్క్వేర్ చాలా క్రేజ్ మధ్య వస్తోంది. దానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే జనాలను తనవైపు తిప్పుకోవడం రౌడీ హీరోకు అంత సులభంగా ఉండదు. సో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ది ఫ్యామిలీ స్టార్ కు గోపి సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. చిన్న టీజర్ తప్ప చెప్పుకోదగ్గ వీడియో కంటెంట్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా బయటికి రాలేదు. ట్రైలర్ తర్వాత హైప్ అమాంతం పెరుగుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని సర్కారు వారి పాటకు సరైన రీతిలో వాడుకోలేదన్న కామెంట్స్ కు బదులివ్వాల్సిన పట్టుదలతో ఉన్నాడు పరశురామ్. పైగా గీత గోవిందం కాంబో కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్న ఆడిపాడిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 23, 2024 2:11 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…