వివాదాలు కమల్ హాసన్ కు కొత్త కాదు. అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీద కాంట్రావర్సి మొదలైంది. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి 2014లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. టీజర్ లో కంటెంట్ చూసిన మైనారిటీ వర్గాలు కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు టిఎంజికె సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అమరన్ లో చూపిస్తున్నది వాస్తవాలే. వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు. అవన్నీ అసురన్ లో చూపించే అవకాశముంది. కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. కమల్ ఇలాంటివి ఎన్నో చూశారు.
విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం. అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసి మరీ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. హే రామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రభస జరిగింది. గాంధీ మద్దతుదారులు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలా ఎన్నో సందర్భాల్లో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అమరన్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారి తీస్తుందా చూడాలి.
This post was last modified on February 23, 2024 12:37 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…