సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్ద హిట్ ఏదీ రాలేదు. తమిళ సినిమాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మామూలుగానే ఫిబ్రవరి అంటే అన్‌సీజన్. ఈ టైంలో క్రేజీ సినిమాలు రిలీజ్ కావు. చిన్న సినిమాల్లో మంచి విజయం సాధించేవి తక్కువే. కానీ ఇదే సీజన్లో వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇస్తోంది మలయాళ ఇండస్ట్రీ. ఫిబ్రవరిలో మలయాళ సినిమాల డ్రీమ్ రన్ నడుస్తోంది.
ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్పిన్ కండేదుం రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న సమయంలోనే రెండో వారంలో ప్రేమలు అనే మూవీ వచ్చింది. ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ప్రేమలు బాగా ఆడుతోంది.
ఇక మూడో వారంలో రిలీజైన మమ్ముట్టి సినిమా భ్రమయుగం బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. అది కూడా బ్లాక్‌బస్టరే అని తేలిపోయింది. ఈ మూడు చిత్రాలూ బాగా ఆడుతుండగా.. ఇప్పుడు ఇంకో సినిమా మలయాళ ప్రేక్షకులను మురిపిస్తోంది. అదే.. మంజుమ్మెల్ బాయ్స్. ఇందులో పేరున్న హీరోలెవరూ లేరు. ఎక్కువమంది కొత్త నటులు ప్రధాన పాత్రలు చేశారు. గురువారమే రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీకి అదిరిపోయే టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయింది. దీన్ని వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు.
మొత్తానికి అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఒక భాషలో నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్లు రావడం అరుదైన విషయమే.
This post was last modified on February 23, 2024 10:48 am
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…