Movie News

త్రిషపై మాట మార్చిన ఆ నేత

తమిళ సీనియర్ నటి త్రిష పేరు తన ప్రమేయం లేకుండా మరోమారు చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల కిందట త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించి, అది లేకపోవడంతో నిరాశ చెందానని మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయంలో త్రిష కొంచెం ఘాటుగానే స్పందించింది. మన్సూర్‌కు వార్నింగ్ ఇచ్చి అంతటితో ఆ విషయాన్ని విడిచిపెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు త్రిష గురించి రాజు అనే అన్నాడీఎంకే నేత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలిసిన ఒక వ్యక్తి త్రిషతో గడిపాడని.. అందుకుగాను ఆమె రూ.25 లక్షలు తీసుకుందని రాజు చీప్ కామెంట్స్ చేయడంపై తమిళ ఇండస్ట్రీ భగ్గుమంది.

ఈసారి విషయాన్ని తేలిగ్గా వదిలేస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని భావించిన త్రిష.. లీగల్ యాక్షన్‌కు రెడీ అయింది. రాజు ఏదైనా పత్రిక ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు పరువు నష్టం కింద పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఐతే తన మీద సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో రాజు స్పందించాడు. ఇలా చెత్త కామెంట్స్ చేసి నాలుక్కురుచుకునే వాళ్లందరూ ఏం కామెంట్ చేస్తారో అదే చేశాడు రాజు కూడా.

తన వ్యాఖ్యలను మీడియా వాళ్లు వక్రీకరించారని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి త్రిష ఒక సెటిల్మెంట్లో భాగంగా అప్పుడు రూ.25 లక్షలు తీసుకుందని చెప్పడం తన ఉద్దేశమన్నాడు. త్రిషతో పాటు తాను ఆ సందర్భంలో ప్రస్తావించిన వెంకటాచలం అనేే వ్యక్తికి కూడా క్షమాపణ చెప్పాడు రాజు. మరి త్రిష ఇంతటితో శాంతిస్తుందా లేక నోటీసుల్లో పేర్కొన్నట్లు న్యూస్ పేపర్ ద్వారా క్షమాపణ చెప్పడంతో పాటు పరిహారం ఇచ్చే వరకు పట్టుబడుతుందా అన్నది చూడాలి.

This post was last modified on February 22, 2024 3:45 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

59 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago