తమిళ సీనియర్ నటి త్రిష పేరు తన ప్రమేయం లేకుండా మరోమారు చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల కిందట త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించి, అది లేకపోవడంతో నిరాశ చెందానని మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ విషయంలో త్రిష కొంచెం ఘాటుగానే స్పందించింది. మన్సూర్‌కు వార్నింగ్ ఇచ్చి అంతటితో ఆ విషయాన్ని విడిచిపెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు త్రిష గురించి రాజు అనే అన్నాడీఎంకే నేత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలిసిన ఒక వ్యక్తి త్రిషతో గడిపాడని.. అందుకుగాను ఆమె రూ.25 లక్షలు తీసుకుందని రాజు చీప్ కామెంట్స్ చేయడంపై తమిళ ఇండస్ట్రీ భగ్గుమంది.
ఈసారి విషయాన్ని తేలిగ్గా వదిలేస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని భావించిన త్రిష.. లీగల్ యాక్షన్‌కు రెడీ అయింది. రాజు ఏదైనా పత్రిక ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు పరువు నష్టం కింద పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఐతే తన మీద సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో రాజు స్పందించాడు. ఇలా చెత్త కామెంట్స్ చేసి నాలుక్కురుచుకునే వాళ్లందరూ ఏం కామెంట్ చేస్తారో అదే చేశాడు రాజు కూడా.
తన వ్యాఖ్యలను మీడియా వాళ్లు వక్రీకరించారని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి త్రిష ఒక సెటిల్మెంట్లో భాగంగా అప్పుడు రూ.25 లక్షలు తీసుకుందని చెప్పడం తన ఉద్దేశమన్నాడు. త్రిషతో పాటు తాను ఆ సందర్భంలో ప్రస్తావించిన వెంకటాచలం అనేే వ్యక్తికి కూడా క్షమాపణ చెప్పాడు రాజు. మరి త్రిష ఇంతటితో శాంతిస్తుందా లేక నోటీసుల్లో పేర్కొన్నట్లు న్యూస్ పేపర్ ద్వారా క్షమాపణ చెప్పడంతో పాటు పరిహారం ఇచ్చే వరకు పట్టుబడుతుందా అన్నది చూడాలి.