ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్ తేజ్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉన్నాడు. అడిగిన వాళ్లకు కాదనకుండా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నాడు. అలా అని సినిమా మీద విపరీతమైన బజ్ ఉందా అంటే అంతగా లేదు. రావాలనే ఈ తాపత్రయమంతా. వరుణ్ గత రెండు చిత్రాలు భారీ డిజాస్టర్లు. గని కాస్త డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా గాండీవదారి అర్జున దానికి కూడా నోచుకోలేదు. సో మార్కెట్ వెనక్కు తెచ్చుకోవడానికి వరుణ్ తేజ్ కి ఇదే మంచి అవకాశం.
అంతా బాగానే ఉంది కానీ ఆపరేషన్ వాలెంటైన్ మీద అంచనాలు ఏర్పడ్డంలో పూలూ ముళ్ళు రెండూ ఉన్నాయి. మొదటిది హృతిక్ రోషన్ ఫైటర్ తో పోలికలు. బాలీవుడ్ లో ఇది సమస్యయ్యే రిస్క్ కాబట్టి కొట్టి పారయలేం. పైగా వరుణ్ కి హిందీలో ఇది డెబ్యూ లాంటిది. దీనికన్నా పెద్ద కాన్వాస్ అంత సులభంగా దొరక్కపోవచ్చు . సో హిట్ పడితే నెక్స్ట్ చేస్తున్న సినిమాలను ప్యాన్ ఇండియా బ్రాండ్ తో మార్కెట్ చేసుకోవచ్చు. ట్రైలర్ లో చూపించిన గ్రాండ్ విజువల్స్ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతున్నాయి కానీ మాస్ వర్గాలను రాబట్టుకోవడమే వాలెంటైన్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్.
అలా అని పోటీ లేకుండా దిగట్లేదు. హాలీవుడ్ మూవీ డ్యూన్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రజాకార్ ని గట్టిగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ చారి 111 క్రమంగా బజ్ పెంచుకునే పనిలో ఉంది. భూతద్దం భాస్కర్ నారాయణ పబ్లిసిటీ ఆకట్టుకునేలా జరుగుతోంది. రజాకార్ తప్ప మిగిలినవి ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా నడిచేవి. మరి ఆకాశంలోనే కథంతా నడిచే ఆపరేషన్ వాలెంటైన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సవాలే. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ వార్ డ్రామాకు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించాడు.
This post was last modified on February 22, 2024 12:12 pm
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…