Movie News

భలే మంచి మల్టీప్లెక్సు వ్యాపారము

ఒకప్పుడు హీరోలు నటించడం ద్వారా వచ్చిన డబ్బుని ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో లేదా ఆస్తులు కూడబెట్టడంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కొందరు థియేటర్లు కట్టుకుని వాటి నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ముని కుటుంబ వారసులకు వచ్చేలా చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతిదీ ఖరీదైపోయింది. స్వంతంగా ఓ పది సెంట్ల చోటు కొనాలన్నా హైదరాబాద్ లాంటి నగరాల్లో కోట్లు కావాలి. భాగస్వామ్యం లేకుండా బిజినెస్ చేయడం కష్టమైపోయింది. అందుకే పార్ట్ నర్ షిప్పులు పెరుగుతున్నాయి. అలాంటిదే మల్టీప్లెక్స్ వ్యాపారం. టాలీవుడ్ లో ఈ తరహా టై అప్ లు పెరుగుతున్నాయి.

మహేష్ బాబుతో గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో సూపర్ ప్లెక్స్ నిర్మించాక దానికి వచ్చిన స్పందన, రెవిన్యూ చూసి ఇతర స్టార్లు క్రమంగా ఇదే బాట పట్టడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఇదే సంస్థతో మెహబూబ్ నగర్ లో సముదాయం కట్టించగా అమీర్ పేట్ సత్యం థియేటర్ ని పడగొట్టి అందులో మల్టీప్లెక్స్ కట్టడం ద్వారా అల్లు అర్జున్ ఈ రంగంలో అడుగు పెట్టాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇదే తరహాలో దిల్ సుఖ్ నగర్ లో ఆరు స్క్రీన్ల సముదాయాన్ని ఏషియన్ తోనే ప్లాన్ చేసుకున్నారట. అతి త్వరలో ప్రారంభమయ్యేలా పనులు జరుగుతున్నాయట.

ఒక్కటి మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏడాది పొడవునా హిట్ సినిమాలు లేక ఎన్నో వారాలు డెఫిషిట్లతో నడుస్తున్న థియేటర్లు ఎక్కువైపోయాయని బయ్యర్లు వాపోతున్న టైంలో ఇలా ఇబ్బడిముబ్బడిగా మల్టీప్లెక్సులు హైదరాబాద్ లో పెరుగుతూ పోవడం గమనార్హం. ఖరీదు ఎక్కువైనా సరే సగటు మధ్య తరగతి జనాలు కూడా మంచి అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే సింగల్ స్క్రీన్ల కన్నా వీటికి డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఏషియన్ లాంటి సంస్థలు పక్కా ప్రణాళికతో స్టార్ హీరోలతో చేతులు కలిపి తమ నెట్ వర్క్ ప్లస్ బిజినెస్ రెండూ పెంచేసుకుంటున్నాయి.

This post was last modified on February 21, 2024 10:56 pm

Share
Show comments

Recent Posts

మా కోసం ప్ర‌చారం చేస్తారా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. ప్ర‌ధాని మోడీ బిగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. మోడీ వ‌రుస‌గా మూడోసారి కూడా.. ప‌ర‌మ ప‌విత్ర కాశీ…

3 mins ago

సింగల్ స్క్రీన్ల మనుగడకు మొదటి హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు సింగల్ స్క్రీన్లను మూసేయాలనే నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.…

1 hour ago

90 రోజుల పరుగు పందెంలో పుష్పరాజ్

పుష్ప 2 ది రైజ్ విడుదలకు సరిగ్గా మూడు నెలలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 15 నుంచి ఎలాంటి…

2 hours ago

పోటెత్తిన ఓట‌రు 81.6 శాతం ఓటింగ్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌?

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ అన్ని…

2 hours ago

సుధీర్ బాబు చుట్టూ సవాళ్ల వలయం

టాలెంట్ కి ఎలాంటి లోటు లేకపోయినా కష్టపడే తత్వంలో తన రేంజ్ హీరోల కంటే కొన్ని అడుగులు ముందున్న సుధీర్…

4 hours ago

భారతీయుడు ఈసారైనా మాట మీద ఉంటాడా

దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 కొత్త విడుదల తేదీ దాదాపుగా ఖరారయ్యిందని సమాచారం.…

5 hours ago