చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర షూటింగ్ జనవరి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో చిరు, త్రిషలు పాల్గొన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం సెలవుల కోసం అమెరికాలో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే కంటిన్యూ చేయబోతున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరిలను మించి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నట్టు యూనిట్ తెగ ఊరిస్తోంది. ఇప్పుడు మరో కీలక లీక్ ఆసక్తిగొలిపేలా ఉంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం విశ్వంభరలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు. భీమవరం దగ్గరలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుంది. పెద్ద కుటుంబమే అయినప్పటికీ అయిదుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యత అతని తలమీదే ఉంటుంది. దానికోసమే ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు. గతంలో ఇంత సిస్టర్ సెంటిమెంట్ తో చిరంజీవి చేసిన మూవీ హిట్లర్ ఒక్కటే. అది ఎమోషన్స్ ఎక్కువగా నడిచే ఫ్యామిలీ కం కమర్షియల్ డ్రామా. కానీ విశ్వంభర దానికి పూర్తి విరుద్ధం. అయినా ఇందరేసి తోబుట్టువులు ఉన్నారంటే ఖచ్చితంగా భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తాడు వశిష్ట.
ప్రస్తుతం వీళ్ళ క్యాస్టింగ్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. నా సామిరంగలో మెప్పించిన ఆశికా రంగనాథ్ పేరు పరిశీలనలో ఉందట. హీరోయిన్లు కాకపోయినా చిరు ఫ్యామిలీ సభ్యులుగా పేరున్న ఫిమేల్ ఆర్టిస్టులనే తీసుకోవాలని నిర్ణయించినట్టు వినికిడి. మృణాల్ ఠాకూర్ కూడా జోడిగా ఉండకపోవచ్చని అంటున్నారు. త్రిష మాత్రమే ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసిన మెయిన్ లీడ్. చెల్లెల్లు కాకుండా ఇంకో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉందట. వశిష్టకు ఇదే పెద్ద కసరత్తుగా మారింది. బడ్జెట్ విషయంలో యువి సంస్థ భారీగా ఖర్చు పెడుతోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ.
This post was last modified on February 21, 2024 4:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…