తమిళ నటుడు మాధవన్ చూడ్డానికి చాాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. తొలి చిత్రం ‘సఖి’తో మొదలుపెడితే అతను కెరీర్లో చాలా వరకు సాఫ్ట్ క్యారెక్టర్లే చేశాడు. మొదట్లో అతడికి లవర్ బాయ్ ముద్ర ఉండేది. తర్వాత రకరకాల పాత్రలు చేసి మెప్పించాడు. ‘యువ’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రఫ్ క్యారెక్టర్‌తో మెప్పించాడు. తెలుగులో అతను ‘సవ్యసాచి’ చిత్రంలో విలన్ పాత్రలోనూ నటించిన సంగతి తెలిసిందే. అందులో మాధవన్ పెర్ఫామెన్స్ బాగున్నప్పటికీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మాధవన్‌ను విలన్ పాత్రలో మన వాళ్లు జీర్ణించుకోలేదనే చెప్పాలి. ఐతే ఇప్పుడు మాధవన్ బాలీవుడ్లో విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ‘సైతాన్’ అనే పెద్ద సినిమాలో అతను నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
సైతాన్ ఎంతో ఆసక్తి రేకెత్తించే కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం. క్వీన్, సూపర్ 30 లాంటి చిత్రాలు రూపొందించిన వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకుడు. అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా నటించడమే కాదు.. స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు కూడా.
కోలీవుడ్ హీరోయిన్, సూర్య భార్య జ్యోతిక ఇందులో హీరోయిన్ పాత్ర చేస్తుండడం విశేషం. ఆమె చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటిస్తున్న చిత్రమిది. పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న జ్యోతిక తిరిగి అక్కడ కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. గతంలో జ్యోతిక పక్కన హీరోగా నటించిన మాధవన్.. ‘సైతాన్’లో ఆమెకు విలన్ పాత్రలో కనిపించనుండడం విశేషం. మాధవన్ బాలీవుడ్లో చాలా సినిమాలే చేశాడు. కొంచెం గ్యాప్ తర్వాత బాలీవుడ్లోకి అతను రీఎంట్రీ ఇస్తున్నాడు. మార్చి 8న ‘సైతాన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on February 20, 2024 4:29 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…