మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన మమ్ముట్టి భ్రమ యుగంని తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ శుక్రవారం 23 రిలీజ్ చేయడానికి సిద్ధపడటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నిర్మాత నాగవంశీ గుంటూరు కారం ఇంటర్వ్యూల సమయంలో ఇకపై డబ్బింగ్ సినిమాలు పంపిణి చేయమని చెప్పడం గుర్తే. కానీ దానికి భిన్నంగా ఇప్పుడీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ కావడం ఊహించని పరిణామం. అయితే భ్రమ యుగంకి ఇదో సానుకూలాంశం కానుంది. ఎందుకంటే సితారకున్న నెట్ వర్క్ చిన్నది కాదు. ఏపీ తెలంగాణలో మంచి థియేటర్లను దక్కించుకోవడంలో దోహదపడుతుంది.
గత ఏడాది దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీ మధ్య లియోకి మంచి రిలీజ్ వచ్చేలా చేసింది సితార. ఇప్పుడు భ్రమ యుగంకి అలాంటి సమస్య లేదు. ఎందుకంటే రేస్ లో ఉన్నవన్నీ చిన్న సినిమాలే. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, సుందరం మాస్టర్ రెండింట్లో కమెడియన్లే హీరోలు. టాక్ బ్రహ్మాండంగా వస్తేనే నిలబడతాయి. వర్మ వ్యూహం ఏ ఎజెండాతో తీశారో తెలిసిందే కాబట్టి దానికొచ్చే ఓపెనింగ్స్ ని ఈజీగా చెప్పేయొచ్చు. అర్జున్ రెడ్డి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న సిద్దార్థ్ రాయ్ నిలబడాలంటే ఏదో అద్భుతం జరగాలి. హీరో దర్శకుడు అంతకు మించే అంటున్నారు.
సో వీటి మధ్య భ్రమ యుగం రావడం ఒకరకంగా దానికి అడ్వాంటేజే. అయితే హారర్ జానర్ కున్న పరిమిత రీచ్, మమ్ముట్టికి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, మన ప్రేక్షకులు అంత సులభంగా అంగీకరించని స్లో నెరేషన్ లాంటి కొన్ని అంశాలు ఈ విభిన్న ప్రయోగానికి ఇబ్బందిగా మారొచ్చు. ఒరిజినల్ వెర్షన్ ని థియేటర్లలో చూసినవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనికన్నా ముందు ఇంకో సంచలనం ప్రేమలుని డబ్బింగ్ చేయమని మూవీ లవర్స్ కోరుతున్నారు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on February 19, 2024 5:14 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…