రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఆర్సి 16 ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకోవడం ఆలస్యం మేకోవర్ కోసం ఒక నెల గ్యాప్ తీసుకుని అటుపై ఈ సెట్లో మెగా పవర్ స్టార్ అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యంగా జరిగిపోవడంతో పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. క్యాస్టింగ్ కి సంబంధించిన ఆడిషన్లను ఈ నెలలోనే కొలిక్కి తెస్తారు. ఎంపిక చేసిన వాళ్ళతో హైదరాబాద్ లో వర్క్ షాప్ ఉంటుంది. వేసవిలో చిత్రీకరణ స్టార్ట్ చేసేలా సెట్ చేసుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారనే వార్త పది రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. టీమ్ స్పందించే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ ఒక మీడియా ఛానల్ తో చేసిన ప్రైవేట్ ఛాట్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన కూతురు రామ్ చరణ్ సరసన నటించబోతోందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో చిరంజీవితో భాగం పంచుకుంటే ఇప్పుడు ఆమె తనయ రామ్ చరణ్ తో జోడి కట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సో ఆర్సి 16 బృందం చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే ఆర్ఆర్ఆర్ లో ఉన్న ఇంకో హీరోతో జోడి కట్టే అవకాశం రావడం అదృష్టమే. ఈ లెక్కన ఎక్కువ హైదరాబాద్ లోనే గడపాల్సి రావొచ్చు. ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్ లో జాన్వీకి పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోతోంది. పెర్ఫార్మన్స్ ఎంత బాగా ఇస్తున్నా స్టార్ల సరసన కుదరడం లేదు. కానీ తెలుగులో తారక్, చరణ్ ల సరసన ఒకేసారి జాక్ పాట్ కొట్టేసింది. ఇవి హిట్ అయితే మాత్రం హ్యాపీగా ఇక్కడే సెటిలైపోవచ్చు.
This post was last modified on February 19, 2024 11:23 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…