గత ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చి ఆ అంచనాలను అందుకోలేక యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకున్న సినిమా లియో. పేరుకు తమిళ సినిమా కానీ.. తెలుగులో దీనికి బంపర్ క్రేజ్ వచ్చింది. సౌత్ ఇండియా అంతటా సినిమా భారీ స్థాయిలో రిలీజైంది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. కానీ సినిమా వీకెండ్ తర్వాత నిలవలేకపోయింది. ఖైదీ, విక్రమ్ తర్వాత లోకేష్ కనకరాజ్ నుంచి ప్రేక్షకులు ఎంతో ఆశించగా.. అతను మరీ పేలవంగా సినిమాను నడిపించి ప్రేక్షకులను నిరాశపరిచాడు.
రిలీజ్ తర్వాత లియో విషయంలో జరిగిన తప్పులను అతను అంగీకరించాడు. సెకండాఫ్ తేడా కొట్టిందని.. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నానని.. లియో పార్ట్-2 విషయంలో జాగ్రత్త పడతానని అన్నాడు. లియో కథను అసంపూర్తిగా వదిలేసిన నేపథ్యంలో సీక్వెల్ ఉంటుందనే అభిమానులు కూడా ఆశించారు.
కానీ ఫస్ట్ పార్ట్‌కు ఆశించిన పలితం రానపుడు సీక్వెల్ రావడం కష్టం. దీనికి తోడు విజయ్ ఈ మధ్యే తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించాడు. ఇంకొక్క సినిమా చేసి తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అవుతానని ప్రకటించాడు. విజయ్ చివరి చిత్రం కోసం వేరే దర్శకులు రేసులో ఉన్నారు. అతను పొలిటికల్ సబ్జెక్ట్ చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఐతే లోకేష్ కనకరాజ్ మాత్రం లియో-2 ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నాడు. ఆ సినిమా కోసం కథ కూడా సిద్ధంగా ఉందని.. విజయ్ అంగీకరిస్తే ఆ సినిమా ఉంటుందని అతను చెప్పాడు.
లియో విషయంలో జరిగిన తప్పులు పార్ట్-2లో సరిదిద్దుకుంటానని చెప్పిన లోకేష్ కనకరాజ్.. లియో-2 ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం తనకు తెలియదన్నాడు. విజయ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సినిమా ఉంటుందని లోకేష్ చెప్పాడు. కానీ విజయ్ లియో-2 కోసం సమయం కేటాయించే అవకాశాలు దాదాపు లేనట్లే కనిపిస్తున్నాయి.
This post was last modified on February 18, 2024 11:07 pm
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…