తమిళ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ పేరెత్తగానే బొద్దైన అవతారం గుర్తుకొస్తుంది. ఆమె కమెడియన్‌గా రాణించడానికి తన లుక్ కూడా ఒక కారణమే. ఇలా బొద్దయిన అవతారంతోనే లేడీ కమెడియన్లు చాలామంది అవకాశాలు అందుకున్నారు. తన లుక్ విషయంలో ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ లేవని గతంలో చెప్పింది విద్యుల్లేఖ. అదే లుక్‌తో గతంలో ఆమె ఒక హాట్ ఫొటో షూట్ కూడా చేసింది.
లావుగా ఉన్న వాళ్లు ఇలాంటి ఫొటో షూట్లు చేయకూడదా అంటూ ఆత్మవిశ్వాసంతో అడిగింది. కానీ అప్పటికి ఆమె మానసిక స్థితి అలా ఉందేమో కానీ.. తర్వాతి రోజుల్లో తన అవతారం విషయంలో ఆమె బాధ పడిందని తాజా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. లాక్ డౌన్ టైంలో విద్యుల్లేఖ ఒక్కసారిగా బరువు తగ్గి మామూలు అమ్మాయిలా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తనను ట్రైన్ చేసిన అబ్బాయినే పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైంది.
ఒకప్పుడు తాను లావుగా ఉన్న, ఇప్పుడు సన్నబడ్డ ఫొటోలు రెండూ సోషల్ మీడియాలో షేర్ చేసిన విద్యుల్లేఖ.. ఇలా బరువు తగ్గాలని పట్టుబట్టడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. లావుగా ఉన్న ఫొటో గురించి వివరిస్తూ.. ఒక తమిళ సినిమా ఆడియో వేడుకకు వెళ్లాల్సిన సమయంలో రెడీ కాబోతుంటే ఇంట్లో ఉన్న బట్టలేవీ తనకు సరిపోలేదని.. దీంతో ఒక లెగ్గింగ్ వేసుకుని.. పైన ఒక కోట్ వేసి కవర్ చేశానని.. అప్పుడు తన మీద తనకే చాలా కోపం వచ్చిందని విద్యుల్లేఖ చెప్పింది.
ఇంతకుముందు తన బరువు విషయంలో బాధ పడకూడదని తనకు తాను సర్దిచెప్పుకున్నానని.. కానీ గత ఏడాది కొన్ని అనుభవాల వల్ల బరువు తగ్గడం కోసం తనలో తాను స్ఫూర్తి నింపుకున్నానని ఆమె వెల్లడించింది. ‘‘ఇంతకుముందు నా బరువు 86.5 కేజీలు. ఇప్పుడు 65.2 కేజీలకు చేరా. అంటే 20 కేజీలకు పైగా తగ్గాను. ఇది శ్రమ, కన్నీళ్లు, అనేక మలుపులతో కూడుకున్న సుదూర ప్రయాణం’’ అని విద్యుల్లేఖ వెల్లడించింది.
This post was last modified on September 9, 2020 3:02 pm
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…