రవితేజ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. ఈగల్. ఆయనతో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన పీపుల్స్ మీడియా వాళ్లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద బడ్జెట్లో నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం.. ప్రోమోలతో ప్రేక్షకుల్లో బాగానే క్యూరియాసిటీ పెంచగలిగింది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయగలదన్న అంచనాలు కలిగాయి ప్రోమోలు చూస్తే.
సంక్రాంతికి భారీ పోటీ మధ్య ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు కుదరక వాయిదా వేశారు. ఫిబ్రవరి 9న పెద్దగా పోటీ లేకుండా అనుకూల బాక్సాఫీస్ వాతావరణంలో సినిమాను రిలీజ్ చేశారు. కానీ టీజర్, ట్రైలర్లు ఉన్నంత ఆసక్తికరంగా సినిమా లేకపోవడంతో డివైడ్ టాక్ తప్పలేదు.
‘ఈగల్’కు రివ్యూలన్నీ నెగెటివ్‌గానే రాగా.. నిర్మాతలు మాత్రం పబ్లిక్ టాక్ సూపర్ అంటూ తొలి వీకెండ్లో గట్టిగా పబ్లిసిటీ చేశారు. రవితేజ మీద ప్రేక్షకుల్లో ఉన్న సానుకూల అభిప్రాయం, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడం, పబ్లిసిటీ కలిసొచ్చి వీకెండ్ వరకు ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కానీ తర్వాత వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. ఆ తర్వాత సినిమా ఎంతమాత్రం పుంజుకోలేదు.
వారం తిరిగేసరికే ‘ఈగల్’ థియేట్రకల్ రన్ అయిపోయే పరిస్థితి వచ్చింది. రెండో వీకెండ్లో ‘ఈగల్’ ప్రభావం కనిపించడం లేదు. చిత్ర బృందం కూడా ఇక పబ్లిసిటీ వృథా అని సైలెంట్ అయిపోయింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ వైపు ప్రేక్షకులు మళ్లారు. దీనికి తోడు ‘ఓయ్’ రీ రిలీజ్ సందడి కనిపిస్తోంది తప్ప ‘ఈగల్’ సౌండ్ లేదు. వారం తిరిగేసరికే ‘ఈగల్’ రెక్కలు విరిగిపోవడంతో నిర్మాతలే కాక బయ్యర్లకు కూడా భారీ నష్టాలు తప్పట్లేదు.
This post was last modified on February 18, 2024 7:37 am
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…