Movie News

కామెడీ హీరోల సీరియస్ పోటీ

ఈ వారం సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు ఏమీ లేవు. దీనికి టాక్ మిక్స్డ్ గా వచ్చినా వీకెండ్ రిపోర్ట్స్, వసూళ్లు బాగానే ఉండటంతో హిట్ రేంజ్ కి చేరుకుంటుందా లేదాని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సోమవారానికి అది తేలిపోతుంది కానీ నెక్స్ట్ ఫిబ్రవరి 23 వచ్చే కొత్త సినిమాల మీద అందరి దృష్టి వెళ్తోంది. వెరైటీగా ఈసారి కామెడీ స్టార్లు నువ్వా నేనాని తలపడుతున్నారు. మొదటిది వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్. ఇంగ్లీష్ బాగా మాట్లాడే ఒక గూడెంలో ఇరుక్కున్న బొద్దు టీచర్ గా ఇందులో హర్ష పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర చేశాడు.

ట్రైలర్ తర్వాత మెల్లగా ఆసక్తి పెరుగుతోంది. రెండోది అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. తనకు బాగా పేరు తీసుకొచ్చిన ఈ నగరానికి ఏమైందిలో ఊత పదాన్ని తీసుకుని టైటిల్ గా పెట్టేసి తీశారు. పదో తరగతి తర్వాత చదువు ఆపేసిన చిత్రకారుడిగా ఫన్నీగా డిజైన్ చేశారు. హర్ష, అభినవ్ ఇద్దరి నిర్మాతలు కంటెంట్ నే నమ్ముకున్నారు. మొదటి రోజు వీళ్ళ కోసమే థియేటర్ కొచ్చే ఆడియన్స్ తక్కువగా ఉంటారు. చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప సాయంత్రానికో లేదా వీకెండ్ కో ఆక్యుపెన్సీలు పెరగవు. ఒకరకంగా చెప్పాలంటే హీరోల కంటే ఎక్కువగా దర్శకులకే ఇది ఛాలెంజ్.

సానుకూలాంశం ఏంటంటే పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడం. భైరవకోన స్టడీగా ఉన్నా ఇబ్బంది లేదు. విరూపాక్ష రేంజ్ లో స్ట్రాంగ్ గా నిలబడుతుందని చెప్పలేం కానీ ఉన్నంతలో డీసెంట్ పికప్ తో నడిస్తే చాలు. సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రాకు జరిగే బిజినెస్ తక్కువే కాబట్టి బ్రేక్ ఈవెన్ పరంగా రిస్క్ ఉండదు. తక్కువ సెంటర్లతోనే గట్టెక్కే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే డ్రైగా నడిచే ఫిబ్రవరిలో ఇమేజ్ ఉన్న హీరోలే జనాలని లాగేందుకు ఇబ్బంది పడతారు. అలాంటిది స్కూల్ పిల్లల కన్నా పెద్ద పరీక్ష హర్ష, అభినవ్ లకే ఉంటుంది. సిద్దార్థ్ రాయ్, వ్యూహం కూడా బరిలో ఉన్నాయి.

This post was last modified on February 17, 2024 5:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago