జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈపాటికి ‘దేవర’ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్‌లో బిజీగా ఉండాల్సింది. సినిమా మొదలైనపుడే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటన ఇచ్చిన చిత్ర బృందం.. నెల కిందటి వరకు అదే మాటకు కట్టుబడి ఉంది. రిలీజ్‌కు వంద రోజుల కౌంట్ డౌన్ కూడా ఇచ్చారు ఆ మధ్య. కానీ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడడం, ఇంకేవో కారణాలతో ఏప్రిల్ 5 నుంచి సినిమాను వాయిదా వేశారు. ముందు మీడియాలో దీని గురించి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిత్ర బృందం తీరును బట్టి వాయిదా అనివార్యం అని తేలిపోయింది.
ఏప్రిల్ 5కు విజయ్ దేవరకొండ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కూడా ఖరారైపోవడంతో తారక్ అభిమానులను నిరుత్సాహం ఆవహించింది. ఐతే ఏప్రిల్ కాకపోతే వేసవి చివర్లో లేదా జులై-ఆగస్టు నెలల్లో అయినా సినిమా వస్తుందని ఆశించారు.
కానీ అక్టోబరు 10 అంటూ వాళ్లు ఊహించని డేట్ ఇచ్చారు. ఇక్కడ్నుంచి ఇంకో ఎనిమిది నెలలు ఎదురు చూడాలంటే అభిమానులకు కష్టమే. ‘అరవింద సమేత’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కోసం నాలుగేళ్లు ఎదురు చూశారు. తర్వాతి సినిమా’ అయినా త్వరగా వస్తుందనుకుంటే.. ‘దేవర’ సెట్స్ మీదికి వెళ్లడంలోనే విపరీతమైన జాప్యం జరిగింది.
అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని షూట్‌కు వెళ్లడంతో రిలీజ్ అయినా అనుకున్న ప్రకారం జరుగుతుందనుకుంటే దగ్గరకొచ్చేసరికి వాయిదా పిడుగు పడింది. కొత్త డేట్ ఇచ్చి క్లారిటీ ఇవ్వడం ఓకే కానీ.. మరీ అంత లాంగ్ డేట్ ఎంచుకోవడం మాత్రం అభిమానులకు నచ్చట్లేదు. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఉస్సూరుమంటున్న పోస్టులే కనిపిస్తున్నాయి. ఒక నిట్టూర్పు విడిచాక కనీసం ఆ డేట్‌కు అయినా కట్టుబడితే చాలని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on February 17, 2024 2:16 pm
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…