థియేటర్ లో ఆడిన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రావడం సహజమే కానీ విజయవంతమైన ఓటిటి మూవీకి కొనసాగింపు అంటే అనూహ్యమే. ప్రియమణి టైటిల్ రోల్ పోషించిన భామ కలాపం 2022లో మంచి సక్సెస్ అందుకుంది. చిన్ని తెరపై చూసినా దాన్ని మలిచిన విధానం చూసి ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. ఆహా మైలేజ్ కు దోహదపడింది. తిరిగి అదే బృందంతో భామ కలాపం 2 తీసుకొచ్చారు. ప్రమోషన్లతో ఆడియన్స్ దృష్టిలో పడేలా చేసుకున్నారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
గతంలో జరిగిన అనూహ్య సంఘటనలను దృష్టిలో పెట్టుకుని భర్త మోహన్(ప్రదీప్ రుద్ర) ఇంకెవరి వ్యవహారాల్లో తలదూర్చొద్దనే కోరిక మేరకు అనుపమ(ప్రియమణి) అపార్ట్ మెంట్ మారేందుకు ఒప్పుకుంటుంది. చేతిలో ఉన్న డబ్బుతో స్వంతంగా రెస్టారెంట్ పెట్టి అసిస్టెంట్ గా పనిమనిషి శిల్ప(శరణ్య ప్రదీప్)నే పార్ట్ నర్ గా చేర్చుకుంటుంది. పెద్ద వంటల పోటీలో పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకున్న తరుణంలో అనుకోకుండా వచ్చిన సమస్య వల్ల ఏకంగా నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ తో చేతులు కలపాల్సి వస్తుంది. ఇంతకీ అనుపమ కొనితెచ్చుకున్న ప్రమాదమేంటో స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలి.
భామాకలాపం 2కి స్కేల్ పెంచినా మొదటిభాగంలో ఉన్న ఫ్రెష్ నెస్, థ్రిల్స్ ఇందులో తగ్గిపోయాయి. అక్కడక్కడా నవ్వించి సస్పెన్స్ మైంటైన్ చేస్తూ మరీ విసుగు రాకుండా చేసినా దర్శకుడు అభిమన్యు అంచనాలు అందుకోవడంలో తడబడ్డాడు. పేపర్ మీద ఎగ్జై టింగ్ గా అనిపించే పాయింట్ స్క్రీన్ పైకి వచ్చేటప్పటికి ఎగుడుదిగుడుగా సాగింది. నెరేషన్ వీకైపోవడంతో ఎంత సీనియర్ ఆర్టిస్టులున్నా వాళ్ళను పూర్తిగా వాడుకోవడం రాలేదు. ప్రియమణి నిరాశపరచలేదు కానీ మిగిలినవాళ్లు జస్ట్ ఓకే. వీకెండ్ లో ఇంకే ఆప్షన్లు లేకపోతే ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ప్రయత్నించడానికి ఓకే అనిపిస్తుంది.
This post was last modified on February 17, 2024 1:56 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…