సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక అమాంతం పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బిజినెస్ వర్గాల్లో మాత్రం క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అన్ని ఏరియాల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని సితార టీమ్ నుంచి వినిపిస్తున్న టాక్. మార్చి 29 అంతా సానుకూలంగానే కనిపిస్తోంది కానీ ఒక గండం మాత్రం కవ్విస్తోంది. అదే రోజు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ – ది న్యూ ఎంపైర్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. తెలుగు డబ్బింగ్ తో సహా అన్ని వెర్షన్లు సమాంతరంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఒక లోకల్ తెలుగు సినిమాకు దానికి సంబంధం ఏంటని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే గాడ్జిల్లా కాంగ్ కున్న క్రేజ్ దృష్ట్యా చిన్నపిల్లలే కాదు యూత్ కూడా దీన్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. అసలైన సమస్య ఓవర్సీస్ లో వస్తుంది. డీజే టిల్లుకి రెండేళ్ల క్రితం యుఎస్ లో భారీ స్పందన దక్కింది. ఏకంగా 2 కోట్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించుకుంది. ఇప్పుడీ కాంపిటీషన్ వల్ల తగినన్ని స్క్రీన్లు దొరక్కపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ బాలీవుడ్ నుంచి ఏదైనా నోటెడ్ రిలీజ్ ఉంటే ఇబ్బంది మరింత పెద్దదవుతుంది. ఏపీ తెలంగాణలోనూ కింగ్ కాంగ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు.
సో సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం టిల్లు స్క్వేర్ కి చాలా అవసరం. నలభై రోజుల ముందుగానే ట్రైలర్ ని వదలడం ద్వారా సితార తెలివైన ఎత్తుగడ వేసింది. వారం తిరక్కుండానే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ ఏప్రిల్ 5న వస్తుంది కాబట్టి ఆలోగా టిల్లు సూపర్ హిట్ అనిపించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. అనుపమ పరమేశ్వరన్ ఎన్నడూ లేని రీతిలో గ్లామర్ షో, లిప్ లాక్ కిస్సులు చేయడంతో ఆ కోణంలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ క్రైమ్ థ్రిల్లర్ కి తమన్ అందించబోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
This post was last modified on February 17, 2024 11:37 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…