Movie News

గేమ్ ఛేంజర్ మేలుకునే టైం వచ్చింది

పవన్ కళ్యాణ్ ఓజి సెప్టెంబర్ 27 వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10 లాక్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 నుంచి తప్పుకునే సమస్యే లేదని తేల్చి చెబుతోంది. ఇవన్నీ గేమ్ ఛేంజర్ కన్నా ఆలస్యంగా మొదలైన ప్యాన్ ఇండియా సినిమాలు. కానీ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ మాత్రం ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఎంత బ్యాలన్స్ ఉందో బయటికి చెప్పడం లేదు. ఫలానా చోట షెడ్యూల్ జరుగుతోందని మీడియాకు న్యూస్ ఇవ్వడం తప్ప ఫలానా తేదీకి పూర్తవుతుందని కనీసం మాట వరసకైనా లీక్ చేస్తే ఒట్టు. దీంతో మెగా ఫ్యాన్స్ అసహనం పీక్స్ కు చేరుకుంటోంది.

నిర్మాత దిల్ రాజుకి సెప్టెంబర్ లో విడుదల చేయాలనేది టార్గెట్. కానీ శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ అధికారికంగా చెప్పలేరు. ఇంకో వైపు డేట్లు లాక్ అయిపోతున్నాయి. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చివరిగా అనౌన్స్ చేసుకుని నాకు మంచి డేట్ కావాలంటే ఇబ్బంది. నిర్మాతగా ఆయన సినిమా పోటీలో లేకపోయినా మొన్న సంక్రాంతికి జరిగిన రచ్చ దృష్ట్యా మరోసారి ఆ తలనొప్పిని మళ్ళీ భరించలేరు. సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉన్న నేపథ్యంలో దానితో క్లాష్ అసాధ్యం. చరణ్, చిరు ఇద్దరూ ఒప్పుకోరు. పోనీ డిసెంబర్ అంటే సలార్ లాగా నెలాఖరులో రావాల్సి ఉంటుంది.

ముందో వెనకో వీలైనంత త్వరగా గేమ్ ఛేంజర్ బృందం విడుదల గురించి ఒక కంక్లూజన్ కు రావడం ఆవసరం. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలో మూవీ రాలేదు. ఆచార్య ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. సో ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నారు. ఇంకోవైపు ఆర్సి 16 కోసం బుచ్చిబాబు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. వేసవిలో మొదలుపెట్టాలని చూస్తున్నారు. శంకర్ వదిలితే తప్ప చరణ్ బయటికి రాలేడు. ఈ చిక్కుముడులన్నీ ఎప్పుడు వీడతాయో చూడాలి.

This post was last modified on February 17, 2024 2:05 pm

Share
Show comments

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

26 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago