అల్లరి నరేష్.. ఈ పేరెత్తగానే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పులుముకునేవి. తొలి సినిమా అల్లరి నుంచి అతను నవ్వించడమే లక్ష్యంగా సాగాడు. సుడిగాడు సినిమా టైంకి ఆ నవ్వులు పీక్స్‌కు చేరుకున్నాయి. ఒక టికెట్ మీద వంద సినిమాలు అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఆ పేరడీ సినిమా.. అందుకు తగ్గట్లే బోలెడంత వినోదం పంచింది. కానీ చాలా సినిమాలకు సరిపడా స్పూఫ్‌లు, పేరడీలు ఆ సినిమాలోనే చేసేసిన నరేష్.. ఆ తర్వాత ఏ సినిమాలో ఈ తరహా కామెడీ చేసినా వర్కవుట్ కాలేదు. వరుసబెట్టి ఫ్లాపులు ఎదురు కావడంతో అతడి కెరీర్ బాగా దెబ్బ తినేసింది.
దీంతో తనకు అతి పెద్ద ప్లస్ అనుకున్న కామెడీనే అతను వదిలేయాల్సి వచ్చింది. నాంది సినిమాతో అతను ఇమేజ్ మేకోవర్‌కు ప్రయత్నించాడు. అది మంచి ఫలితాన్నిచ్చింది. సీరియస్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్టు కొట్టాడు.
ఐతే ఇక తనకు సీరియస్ సినిమాలే కలిసొస్తాయని.. వరుసగా ఆ తరహా సినిమాలు చేస్తే అవీ తేడా కొట్టడం మొదలుపెట్టాయి. మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలు తీవ్ర నిరాశను మిగల్చగా.. సభకు నమస్కారం అనే మరో సీరియస్ మూవీ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఇప్పుడు నరేష్ తిరిగి కామెడీ బాట పడుతున్నాడు. ఆ సినిమానే.. ఆ ఒక్కటీ అడక్కు. తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ కామెడీ మూవీ పేరును వాడుకుని చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి కామెడీ సినిమా చేస్తున్నాడు నరేష్. మల్లి అంకం అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం షూట్ చివరి దశలో ఉంది. నేరుగా టీజర్ రిలీజ్‌తో సినిమాను ప్రకటించారు.
ఇందులో పెళ్లి కాని ప్రసాద్ తరహా పాత్ర చేస్తున్నాడు నరేష్. అందరికీ అతడి పెళ్లి మీదే ఫోకస్ ఉంటుంది. అపార్ట్‌మెంట్లోని వాళ్లంతా వేర్వేరు భాషల్లో తన పెళ్లి గురించి అడుగుతుంటారు. అతను జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతుంటాడు. రాజీవ్ చిలక నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. మార్చి 22న ఆ ఒక్కటీ అడక్కు విడుదల కానుంది.
This post was last modified on February 16, 2024 10:06 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…