సినిమాలో హీరో హీరోయిన్ ఖచ్చితంగా వయసులో ఉన్న వాళ్లయితేనే ఆడియన్స్ అంగీకరిస్తారు. నిజ జీవితంలో కాకపోయినా కనీసం తెరమీద అయినా ఆ జంట ఏజ్ మహా అయితే ముప్పై అయిదు లోపలే ఉండాలి. అంతకు పెరిగితే ఒప్పుకోరు. అయినా సరే రాజేంద్ర ప్రసాద్, జయప్రద లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో ఇలాంటి ప్రయోగం చేయడమంటే విశేషమే. బ్రో, ది రాజా డీలక్స్, ఈగల్, ధమాకా లాంటి బడా స్టార్ల ప్యాన్ ఇండియా సినిమాలు తీసే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లవ్@65 పేరుతో ఈ రిస్క్ తీసుకుంటోంది. ఇవాళ టీజర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఒక గేటెడ్ కమ్యూనిటిలో ఉండే ఒక వృద్ధ జంట ప్రేమలో పడి లోకం ఏమన్నా పట్టించుకోకుండా కలిసి ప్రయాణం చేయడమనే పాయింట్ తో ఇది రూపొందింది. దర్శకుడు విఎన్ ఆదిత్య. ఒకప్పుడు మనసంతా నువ్వే, సంతోషం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈయన తర్వాత రెండు మూడు ఫ్లాపుల వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కంబ్యాక్ కోసం ఇలాంటి రిస్కి సబ్జెక్టుని ఎంచుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా లక్ష్మి భూపాల్ సంభాషణలు అందించారు. ఎక్కడ యూత్ వాసనలు లేకుండా పూర్తిగా ఓల్డ్ ఏజ్ డ్రామా మీద కథ మొత్తం నడిపించారు.
రిస్క్ విషయానికి వస్తే ఇలాంటి కథలు ట్రెండ్ కు ఎదురీదాల్సి ఉంటుంది. కేవలం రాజేంద్ర ప్రసాద్ కోసమే థియేటర్ కు రావడమనేది ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి తర్వాత ఆగిపోయింది. ఆయన లీడ్ రోల్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లవ్@65 తో సోలో హీరోగా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ఓటిటి తరహా కంటెంట్ బిగ్ స్క్రీన్ మీద పండాలంటే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో పండాలి. ఇదంతా ఏమో కానీ దశాబ్దాల తర్వాత జయప్రదని తెరమీద చూడటం పాత ఫాన్స్ కి కొత్త అనుభూతి
This post was last modified on February 16, 2024 6:00 pm
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…