అదేంటో జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమవుతున్న బాలీవుడ్ స్టార్లు గాయాల పాలు కావడం కాకతాళీయమే అయినా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దేవర కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ చిన్న ప్రమాదానికి గురి కావడం, సమస్య తీవ్రం కాకపోయినా ఎక్కువ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం ముంబైలో విశ్రాంతి తీసుకునే పనిలో పడ్డాడు. ఏప్రిల్ 5 విడుదల నుంచి దేవర తప్పుకోవడానికి ఇదొక కారణం. ఎప్పుడు వస్తాడనేది ఈ వారంలోనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు వార్ 2 కి సైతం అచ్చం ఇలాంటి ఇబ్బందే వచ్చి పడింది.
హృతిక్ రోషన్ కారణం బయటికి వెల్లడించకుండా ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. తన ఇన్సాటాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ ద్వారా వీల్ చైర్, హ్యాండ్ స్టిక్స్ తదితరాలు వాడాల్సి రావడం వల్ల ఏం నేర్చుకుంటున్నది అందులో పేర్కొన్నదాడు. ఎలా జరిగిందనే వివరణ ఇవ్వలేదు కానీ ఫోటో చూస్తే మాత్రం ప్రమాదమేదో పెద్దదే జరిగినట్టు అనిపిస్తోంది. ఈ లెక్కన వేసవిలోపే మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్న వార్ 2 కొంత లేట్ అవ్వొచ్చని ముంబై టాక్. ఎందుకంటే తనొచ్చాక ముందు షూట్ చేయాల్సింది యాక్షన్ ఎపిసోడ్లే. వాటితో పాటు తారక్ కాంబినేషన్ లో ఒక డాన్స్ నెంబర్ కూడా ఉంది.
పరిస్థితి చూస్తుంటే హృతిక్ పూర్తి యాక్టివ్ కావడానికి ఇంకో అయిదారు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఫైటర్ పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ఓవర్సీస్ పుణ్యమాని వసూళ్లు బాగా రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. దీని సంగతెలా ఉన్నా వాళ్ళ ఆశలన్నీ వార్ 2 మీదే ఉన్నాయి. ఎలాగూ దేవర లేట్ అవుతోంది కాబట్టి జూనియర్ ఖాళీ సమయాన్ని వార్ 2 ఇద్దామనుకుంటే ఆ ఛాన్స్ కూడా తగ్గిపోతోంది. అదేదో పరీక్ష పెట్టినట్టు ఇలాంటివి జరిగినప్పుడే హీరోలకు కాసింత చికాకు కలగడం సహజం. వయసు ప్రభావం తన మీద ఒక్క శాతం కూడా ఉండదనుంటున్నాడు హృతిక్.
This post was last modified on February 15, 2024 11:39 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…