స్వంత భర్త దర్శకత్వంలో సినిమా. అయినా సరే నయనతార ఎక్కడైనా బావ కాని వంగతోట కాడ కాదనే సూత్రాన్ని పాటిస్తోందని చెన్నై టాక్. విజ్ఞేశ్ శివన్ డైరెక్షన్ లో ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొదలైంది. లవ్ టుడేతో జనాల దృష్టిలో పడ్డ ప్రదీప్ రంగనాథన్ హీరో. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్. ఎస్జె సూర్య లాంటి క్రేజీ క్యాస్టింగ్ వేరే ఉంది. అనిరుద్ రవిచందర్ సంగీతం కావడంతో మ్యూజిక్ పరంగానూ క్రేజ్ ఉంది. హీరో అక్కగా ముందు నయనతార ఓకే చెప్పింది. ఆ మేరకు స్క్రిప్ట్ పక్కాగా రూపొందించుకున్నారు. షెడ్యూల్ కూడా జరుగుతోంది.
తాజా అప్డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు నుంచి నయన్ తప్పుకుందట. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బడ్జెట్ పరంగా ఎక్కువైపోవడంతో నిర్మాతలు తగ్గించుకోమని అడిగితే ససేమిరా అందట. ఇప్పుడామె పాత్ర కోసం ప్రత్యాన్మయం చూస్తున్నారని తెలిసింది. విజ్ఞేశ్ కూడా ప్రొడక్షన్ లో భాగస్వామి అయినప్పటికీ ఈ విషయంలో ఏం చేయలేనని నిస్సహాయత వ్యక్తం చేశాడట. ఇప్పటికే ఈ టైటిల్ మీద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో ఇప్పుడీ సమస్య మెడకు చుట్టుకుంది. దీన్ని పరిష్కరించుకున్నా నయన్ ప్లేసులో ఎవరొస్తారో చూడాలి.
ఇక్కడ వరస డిజాస్టర్లతో కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయిన కృతి శెట్టి ఆశలన్నీ ఎల్ఐసి మీదే ఉన్నాయి. ప్రస్తుతం తనకు టాలీవుడ్ లో శర్వా సినిమా ఒకటే ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్ టైనర్ కు బాబ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే రెండు మూడు నెలల నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. ఇంకో వైపు శర్వా రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాబ్ అయిపోయిందా లేక ఇంకొంత ఆలస్యమవుతుందా చూడాలి. ఈ రెండు హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందనే ఆశతో ఉంది కృతి శెట్టి.
This post was last modified on February 14, 2024 6:15 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…