Movie News

గుంటూరు కారం ఘాటు బలంగా తగులుతోంది

బాక్సాఫీస్ లెక్కలు, వసూళ్ల సంగతి పక్కనపెడితే సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం ఆశించిన ఫలితం అందుకోలేదన్నది వాస్తవం. మహేష్ బాబు కెపాసిటీ, త్రివిక్రమ్ బ్రాండ్ అడ్డుగోడగా నిలబడ్డాయి కానీ లేదంటే రిజల్ట్ ఇంకా భయపెట్టేది. అయితే దీని హవా ఓటిటిలో మాత్రం ఓ రేంజ్ లో ఉంది. వారం తిరక్కుండానే నెట్ ఫ్లిక్స్ ఇండియన్ క్యాటగిరీలో తెలుగు వర్షన్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, హిందీ డబ్బింగ్ నాలుగు, తమిళం ఏడో ర్యాంకులను ఆక్రమించుకున్నాయి. వరల్డ్ వైడ్ ప్రకారం చూసుకుంటే గుంటూరు కారం ఆరో ప్లేసు తీసుకుంది.

థియేట్రికల్ విండో కేవలం 28 రోజులు ఉండటంతో వ్యూస్ భారీగా వస్తున్నాయి. అఫీషియల్ గానే అన్ని భాషలు కలిపి నెట్ ఫ్లిక్స్ లాంటి ఖరీదైన ప్లాట్ ఫార్మ్ లో 4 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడమంటే మాటలు కాదు. డబ్బింగు విషయంలో తీసుకున్న శ్రద్ధ మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తోంది. యానిమల్, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు పాటించిన పద్దతే దీనికీ అనుసరించారు. ఏదో నలుగురు డబ్బింగ్ ఆర్టిస్టులతో అందరికీ చెప్పించడం కాకుండా ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా చేయించడం ఫలితాలు మెరుగు పడేలా చేస్తోంది. సో మొదటి వారం డామినేషన్ గుంటూరు కారందే.

యానిమల్ కు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిన ట్రెండ్ లోనే మహేష్ ఇంత ప్రభంజనం చూపించడం విశేషం. సౌత్ మీద విపరీతమైన పెట్టుబడులు పెడుతూ హక్కులు కొంటున్న నెట్ ఫ్లిక్స్డ్ దానికి తగ్గట్టే భారీ రిటర్న్ అందుకుంటోంది. ఇండియాలో తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి తెలుగు సినిమాలే బెస్ట్ ఆప్షనని గుర్తించి దానికి తగ్గట్టే క్రేజీ డీల్స్ తో నిర్మాతలను లాగేసుకుంటోంది. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాల్లో ఏడెనిమిది నెట్ ఫ్లిక్స్ ఖాతాలోకి వచ్చేశాయి. గుంటూరు కారం లాంటి కమర్షియల్ మసాలా సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం నిజంగా విశేషమే.

This post was last modified on February 14, 2024 12:47 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

23 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago