ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత పెద్ద బడ్జెట్ తో పాటు భారీ బిజినెస్ జరుపుకుంటున్న పుష్ప 2 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే ఆగస్ట్ 15 విడుదల చేసే తీరుతానని బన్నీ, మైత్రి మూవీ మేకర్స్ కు హామీ ఇచ్చేశాడట. పుష్ప 1లో సమంతా ఐటెం సాంగ్ ఎంత కీలకంగా వ్యవహరించిందో మర్చిపోలేం. ఊ అంటావా ఊహు అంటావా అంటూ సామ్ హొయలు పోవడం, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి మాస్ ప్రియులు కిర్రెక్కిపోవడం జరిగాయి. అయితే సీక్వెల్ లో ఇలాంటి పాటకి ఛాన్స్ లేదనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.
ప్రస్తుతానికి ఇంకా ఖరారు చేయకపోయినా పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉండాలని సుకుమార్ బలంగా ఫిక్స్ అయ్యాడట. నిజానికి దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ లో ముందు పాస్ అయ్యింది ఇదేనట. అయితే షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో పాటు కీలకమైన టాకీ పార్ట్, ఇతర పాటల చిత్రీకరణ జరపకుండా స్పెషల్ పాట మీద ఫోకస్ పెట్టడం భావ్యం కాదని భావించి ఆ మేరకు పెండింగ్ పెట్టారని తెలిసింది. కల్కి 2898 ఏడి కోసం త్వరలో హైదరాబాద్ లో ఎక్కువ రోజులు ఉండబోతున్న దిశా పటానిని ఒప్పించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దాదాపు ఓకే కావొచ్చట.
సినిమా ఎంత బాగా వచ్చినా అభిమానుల నుంచి ఐటెం సాంగ్ లేదనే లోటు వినిపించకుండా సుకుమార్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ దిశాతో సాధ్యం కాకపోతే ఇంకో రెండు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తారట. విడుదలకు కేవలం అయిదు నెలలు మాత్రమే సమయముంది. ఇది చాలా తక్కువ టైం. సుకుమార్ ఎంత ఒత్తిడి ఉన్నా పర్ఫెక్షన్ కోసం పాటు పడతారు. చివరి నిముషం ప్రెజర్ల వల్ల పుష్ప 1 ఫైనల్ అవుట్ ఫుట్ లో కొంచెం క్వాలిటీ తగ్గింది. సక్సెస్ ఊపులో దాన్నెవరూ పట్టించుకోలేదు. ఈసారి అలాంటివి జరగకూడదనే టార్గెట్ తోనే సుక్కు పని చేస్తున్నారు.
This post was last modified on February 13, 2024 9:02 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……