సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఫిబ్రవరి 9కి షిఫ్ట్ అయిన ఈగల్ బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించింది. బ్రేక్ ఈవెన్ కష్టమేనని ట్రేడ్ అభిప్రాయపడుతోండగా ఊరి పేరు భైరవకోన తప్ప ఈ వీకెండ్ ఇంకే రిలీజులు లేవు కాబట్టి మరో వారాంతం కలిసి వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈగల్ కు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ ని మెచ్చిన వాళ్ళు లేకపోలేదు. కానీ ఆ ఒక్క అంశం అన్ని వర్గాల ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ముఖ్యంగా రవితేజ నుంచి ఆశించే ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం ప్రధాన లోటు.
ఒకవేళ డేట్ మార్చుకోకుండా జనవరి పండగ బరిలో ఉంటే ఏం జరిగేదని ఆలోచిస్తే కాస్త మెరుగైన ఫలితమే దక్కేదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హనుమాన్ ఒక్కదానికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నా సామిరంగ డీసెంట్ గా గట్టెక్కింది. గుంటూరు కారం సైతం భారీ ఓపెనింగ్స్ తర్వాత ఎదురీదాల్సి వచ్చిందనేది వాస్తవం. సైంధవ్ పూర్తిగా వాష్ అవుట్ అయ్యింది. వెంకీ మూవీ కన్నా ఈగల్ ఎన్నో రెట్లు మెరుగనేది ఒప్పుకోవాల్సిన మాట. సంక్రాంతి హడావిడిలో రవితేజకు మైలేజ్ వచ్చేది. రెండు వారాలు కొత్త సినిమాలు లేని అవకాశాన్ని పంచుకుని ఉండేది.
ఇప్పుడు కూడా బ్యాడ్ టైం అనలేం కానీ కాస్త డ్రైగా ఉండే ఫిబ్రవరిలో యావరేజ్ కంటెంట్ తో ఎవరు వచ్చినా వాళ్లకు ఈ సమస్య తప్పదు. చాలా బాగుంది అంటే తప్ప ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఊపు కనిపించదు. మిర్చి, నేను లోకల్ లాంటివి సక్సెస్ అయ్యింది ఫిబ్రవరిలో వచ్చే. సో ఈగల్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పలేం కానీ సంక్రాంతిని వదులుకోవడం వల్ల అయిదు నుంచి పది కోట్ల దాకా గ్రాస్ రెవిన్యూ తగ్గి ఉండొచ్చన్న కామెంట్ ని కొట్టి పారేయలేం. పోనీ ప్రేమికుల రోజు ఏదైనా పికప్ ఉంటుందనుకుంటే అయిదారు రీ రిలీజులు లవర్స్ కి స్వాగతం చెబుతున్నాయి..
This post was last modified on February 13, 2024 6:02 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…