సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఏఐ(కృత్రిమ మేధస్సు) విప్లవం పెరిగాక దర్శకుల్లో కొత్త ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) లో ఇటీవలే కాలం చేసిన విజయకాంత్ ని క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నరనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చేయడం కొత్తేమి కాదు. గతంలో కలిసుందాం రా, యమదొంగ పాటల్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్టెప్పులను గ్రాఫిక్స్ తో వాడుకున్నారు. కానీ వాటిలో ఒరిజినల్ ఫుటేజ్ నే చూపిస్తారు.
ఇప్పుడలా కాదు. నిజంగానే విజయ్ కాంత్ నటించారా అనేంత సహజంగా క్యారెక్టర్ ఉంటుందట. గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర 90 దశకంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎపిసోడ్లలోనే కెప్టెన్ ఎంట్రీ ఉంటుందట. వెంకట్ ప్రభుకి ఆయనంటే విపరీతమైన అభిమానం. డైరెక్ట్ చేసే ఛాన్స్ రాకపోయినా ఎలాగోలా నివాళి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికి విజయ్ మద్దతు దొరకడం ఈ రకంగా ప్లాన్ చేశారట. ఆల్రెడీ విజయ్ 18 ఏళ్ళ వయసున్న వాడిగా చూపించేందుకు 8 కోట్లు కేవలం ఆ ఒక్క క్యారెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ కే వాడటం విశేషం.
ఇటీవలే లాల్ సలాంలో ఏఆర్ రెహమాన్ చనిపోయిన గాయకుల గొంతులని ఏఐతో మళ్ళీ వాడారు కానీ ఆ ప్రయోగం ట్యూన్స్ బాలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యింది. కానీ విజయ్ కాంత్ విషయంలో అలా జరగకపోవచ్చు. ఇది కనక స్క్రీన్ మీద పేలితే భవిష్యత్తులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు లాంటి లెజెండరీ స్టార్లను మనం కూడా తెరమీద చూసుకోవచ్చు. కాకపోతే భారీగా ఖర్చు అవుతుంది. ఇంకో పది పదిహేను సంవత్సరాలలో ఏఐ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుందని, ఊహించని అద్భుతాలు చూడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on February 13, 2024 2:08 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…