Movie News

ఊపిరాడనంతగా తమన్ బిజీ బిజీ

గుంటూరు కారం విషయంలో తమన్ మీద ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో చూశాం. కుర్చీ మడతపెట్టి పాటను మినహాయించి ఇంకేదీ అల వైకుంఠపురము స్థాయిలో మేజిక్ చేయలేదన్నది మహేష్ బాబు అభిమానుల అసంతృప్తికి ప్రధాన కారణం. సర్కారు వారి పాట గాయాన్ని మరిపించేలా చేస్తాడనుకుంటే కనీసం బీజీఎమ్ కూడా గొప్పగా ఇవ్వలేదన్నది వాళ్ళ కంప్లయింట్. సరే ఇదంతా గడిచిపోయిన గతమైపోయింది కాబట్టి తమన్ కు ఇకపై బోలెడు సవాళ్లు స్వాగతం చెప్పబోతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకమైన ప్యాన్ ఇండియా సినిమాలకు పని చేస్తున్న ఒత్తిడి 2024లో ఉంది.

వాటిలో మొదటిది పవన్ కళ్యాణ్ ఓజి. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఎన్నికలు కాగానే జరుగుతున్న షూటింగ్ కి అనుగుణంగా రీ రికార్డింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం ఎప్పుడైనా శంకర్ నుంచి పిలుపు రావొచ్చు కనక దానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావొచ్చు. వీటికన్నా ముందు తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ కు ఆల్రెడీ వర్క్ మొదలయ్యింది. రవితేజతో ప్లాన్ చేసుకుని తర్వాత సన్నీ డియోల్ కు షిఫ్ట్ అయిన గోపిచంద్ మలినేని ప్రాజెక్టు కూడా తమన్ చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా షూట్ వేగంగా జరుగుతోంది.

తమిళంలో అర్జున్ దాస్ హీరోగా రూపొందుతున్న రాసవతికి తమనే స్వరకర్త. అన్నింటిని మించి ప్రభాస్ ది రాజా సాబ్ రూపంలో పెద్ద బాధ్యత తలమీద ఉంది. డిసెంబర్ లోపే పూర్తి చేయాలనే లక్ష్యంతో దర్శకుడు మారుతీ పని చేస్తున్నాడు కాబట్టి దానికి అనుగుణంగానే తమన్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో రెండు నెలలు గడిచిపోయాయి. పైన చెప్పినవేవి ఇంకా తుదిదశకు చేరుకోలేదు. అంటే ఆరేడు నెలలు తమన్ మీద విపరీతమైన ఒత్తిడి పడటం ఖాయం. తన మీద వస్తున్న కామెంట్స్ కు బలమైన సమాధానం చెప్పాలంటే వీటిలో రెండు మూడు బ్లాక్ బస్టర్స్ అయినా చాలు.

This post was last modified on February 12, 2024 10:08 pm

Share
Show comments

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

11 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago