పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా విడుదలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు మొత్తానికే క్యాన్సిల్ అయ్యిందని, నిర్మాత ఏఎం రత్నంకు డబ్బులు వెనక్కు ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నట్టు కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఎన్నికలయ్యాక ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వినిపిస్తున్న తరుణంలో ఎట్టకేలకు నిర్మాణ సంస్థ నుంచి ఒక ధృవీకరణ వచ్చింది.
ప్రస్తుతం ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో సమాంతరణంగా జరుగుతున్నాయని, ఊహలకు అందని పెద్ద స్థాయిలో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, ఆ థ్రిల్ ని టీజర్ రూపంలో ఆస్వాదించడానికి రెడీ కమ్మని చెబుతూ ట్వీట్ చేయడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. దీని సంగతలా ఉంచితే షూటింగ్ బ్యాలన్స్ ఉన్న మాట వాస్తవమే. దర్శకుడు క్రిష్ అనుష్కతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మొదలుపెట్టిన వార్త నిజమే. కాకపోతే కొంచెం టైం పట్టినా వీరమల్లు అయితే వస్తాడు.
ఒకరకంగా చెప్పాలంటే పుకార్లకు చెక్ పెట్టేయడం మంచిదే. ఇంత పెద్ద పీరియాడిక్ డ్రామా పట్ల ఫ్యాన్స్ కున్న ఎగ్జైట్ మెంట్ చప్పున చల్లారకుండా ఎప్పటికప్పుడు గాసిపులకు బ్రేక్ పడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హరిహరవీరమల్లులో బాబీ డియోల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలా చూసుకున్నా 2024 విడుదల సాధ్యం కాదు కానీ వచ్చే సంవత్సరం ఆశించవచ్చు. ఓజి సెప్టెంబర్ లో వచ్చేస్తుంది కనక 2025 వేసవిలో హరిహర వీరమల్లుని ప్లాన్ చేసుకోవచ్చు. కుదరకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు.
This post was last modified on February 12, 2024 9:55 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…