Movie News

వాలెంటైన్ మీద నమ్మకం పెరిగింది

వచ్చే నెల మార్చి 1 విడుదల కాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ మీద వరుణ్ తేజ్ పెట్టుకున్న నమ్మకం చాలా పెద్దది. సోలో హీరోగా రెండు దారుణమైన డిజాస్టర్లు గని, గాండీవదారి అర్జునలు మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మెగా ప్రిన్స్ ట్యాగ్ ఉన్నప్పటికీ అదేమీ భారీ ఓపెనింగ్స్ కి ఉపయోగపడటం లేదు. షోలు పడక ముందే ఫ్లాపులు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ఇప్పుడలా రిపీట్ కాదనే ధైర్యంతో ప్యాన్ ఇండియా ప్రమోషన్లు భారీ ఎత్తున చేస్తున్నాడు. ఒక్క ముంబై మీడియాకి ఇరవై ఆరు ఇంటర్వ్యూలకు ఎస్ చెప్పాడట. ఆ ఓపికలోనే తన కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవచ్చు.

ఇది అందరు చేసేదే అనుకోవచ్చు కానీ ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. ఇటీవలే రిలీజైన హృతిక్ రోషన్ ఫైటర్ టాక్, రివ్యూల పరంగా ఏమంత ఆశాజనకంగా ఫీడ్ బ్యాక్ తెచ్చుకోలేదు. అయినా సరే మూడు వందల కోట్ల వసూళ్లు దాటించి షాక్ ఇచ్చింది. రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ గాల్లో జరిగే విమానాల యుద్ధాన్ని ఓవర్ సీస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అదే తరహా బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. కాకపోతే దీంట్లో ఎమోషన్లు, వార్ ఎపిసోడ్లు, లవ్ ట్రాక్ ఫైటర్ తో పోల్చుకుంటే బాగా వచ్చాయని వరుణ్ మూవీకి పని చేసిన వాళ్ళ కామెంట్.

ఇదే నిజమైతే వరుణ్ తేజ్ కి చాలా ప్రయోజనాలు రాబోతున్నాయి. మొదటిది బాలీవుడ్ డెబ్యూ ప్రాపర్ గా జరిగిపోతుంది. తాను చేయబోయే తర్వాతి సినిమాలకు నార్త్ మార్కెట్ వస్తుంది. పైగా మానుషీ చిల్లార్ హీరోయిన్ కావడంతో ఫ్లేవర్ పరంగా ఇబ్బంది లేదు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ కూడా హిందీ బ్యాచే. ఉత్తరాది ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాక వరుణ్ తేజ్ తెలుగు పబ్లిసిటీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. సోనీ సంస్థ నిర్మాణం కావడంతో ఇక్కడ స్టార్ హీరోల సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకే ఈ నెలాఖరున ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

This post was last modified on February 12, 2024 4:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

18 minutes ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

1 hour ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

3 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

4 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

4 hours ago