మనకు ఫ్యామిలీ సినిమాల్లోనే కనిపిస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్ రూటు మారుస్తోంది. మాస్ వైపు మొగ్గు చూపిస్తోంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ కూల్ అండ్ ఎమోషనల్ మూవీసే. కానీ మొదటిసారి కమర్షియల్ దారి పట్టినట్టు టాక్. శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో తననే హీరోయిన్ గా అనుకుంటున్న విషయం రెండు నెలల క్రితమే బయటికి వచ్చింది. స్క్రిప్ట్ కోసం టైం ఎక్కువగా తీసుకున్న దాస్ దాన్ని ఒక కొలిక్కి తెచ్చారట. అయితే దీనికి మల్టీస్టారర్ హంగులు ఉంటాయని తెలిసింది.
ఒక కీలక పాత్రకు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని సంప్రదిస్తే ఆయన దాదాపు ఓకే అన్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, విజయ్ జిల్లా లాంటి బ్లాక్ బస్టర్స్ లో భాగమవ్వడం ద్వారా ఈ మలయాళీ స్టార్ మనకు బాగానే దగ్గరయ్యాడు. దానికి తగ్గట్టు పవర్ ఫుల్ క్యారెక్టర్లకు అతికినట్టు సరిపోతారు కాబట్టి ఆయన్ను సంప్రదించడం, సానుకూల స్పందన రావడం జరిగిపోయినట్టు తెలిసింది. తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ తో పాటు టాలీవుడ్ కు చెందిన ఓ మీడియం స్టార్ హీరోని ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట. ఎవరెనేది పేరు లీక్ కాలేదు.
బాలీవుడ్ లో గ్లామర్ షోలకు సైతం ఓకే అంటున్న మృణాల్ ఠాకూర్ సౌత్ లో మాత్రం హోమ్లీ మాత్రమే అంటోంది. క్రమంగా ఆ నిర్ణయంలోనూ మార్పు వచ్చేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఇంకా కొత్త తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. దాని ఫలితం వచ్చాక రెమ్యునరేషన్ పెంచాలనే ఆలోచనో లేక స్టార్ డం పెరిగాక కథలను ఇంకా జాగ్రత్తగా విందామనే ప్లానో చూడాలి. హిందీలో పూజా మేరీ జాన్ ఒకటే మృణాల్ లిస్టులో రిలీజ్ కు రెడీగా ఉంది.
This post was last modified on February 12, 2024 4:16 pm
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…
కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన…