ఈ ఏడాది ఆగస్ట్ 15 మీద చాలా ప్యాన్ ఇండియా సినిమాలు కన్నేశాయి. కారణం ఒకటే. ఆల్రెడీ దాని మీద అధికారికంగా కర్చీఫ్ వేసిన పుష్ప 2 ది రూల్ ఖచ్చితంగా రాదనే నమ్మకంతో. దేవర లాగా వాయిదా వార్త రాకపోదా, వెంటనే లాక్ చేసుకోకపోమా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. వాటిలో నాని సరిపోదా శనివారం, కమల్ హాసన్ భారతీయుడు 2 లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకవేళ వేసవి దాటిపోతే జూనియర్ ఎన్టీఆర్ దేవర 1 కూడా అదే స్లాట్ కోరుకుంటోంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్పష్టంగా పోస్ట్ పోన్ సమస్యే లేదని అధికారికంగా నొక్కి చెబుతోంది.
తాజాగా రష్మిక మందన్న సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని ఒకటి క్లిక్ చేసి షేర్ చేసుకుంది. దాన్ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. సో ఆరు నూరైనా తప్పుకునే ఛాన్స్ లేదన్న మాట. ఇప్పటిదాకా యాభై శాతం పైగా షూటింగ్ పూర్తయిన పుష్ప 2 ని జూలై లోగా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుమ్మడికాయ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్లకు అవసరం కాబట్టి అవసరమైన ఒత్తిడిని రాకుండా చూడమని అల్లు అర్జున్ చెప్పిన సూచనల మేరకు పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ జరుగుతోంది.
ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిలు మీద బయటికొచ్చిన ఆర్టిస్టు జగదీశ్ తో ఉన్న కాంబో సీన్లన్నీ ముందు తీస్తున్నారు. జాతర ఎపిసోడ్ దాదాపు అయిపోయిందని టాక్. పుష్ప 3 గురించి గట్టిగా వినిపిస్తున్న తరుణంలో మూడో భాగం ఉంటుందా లేదానే దాని గురించి టీమ్ నోరు విప్పడం లేదు. సినిమా చూశాక చివర్లో సర్ప్రైజ్ ఇస్తారా లేక విడుదలకు ముందు ఇచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఏమైనా చెబుతారా అనేది వేచి చూడాలి. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం కూడా ఆగస్ట్ 15కి ఖచ్చితంగా రావాలనే టార్గెట్ కి కారణమని టాక్. ఏదైతేనేం టైంకి వస్తే సినీ ప్రియులకు అదే సంతోషం.
This post was last modified on February 12, 2024 1:55 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…