యాత్ర సినిమాలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చాలా గొప్పగా చూపించి ఆయన అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు మహి.వి.రాఘవ్. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రిలీజైన ఈ చిత్రం వైసీపీ పట్ల జనాల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచడానికి కొంత కారణమైంది. ఇప్పుడు మహి మరోసారి ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోను చేస్తూ ‘యాత్ర-2’ తీసి విడుదల చేశారు. ఈ చిత్రం వైసీపీ అభిమానులకు బాగానే నచ్చుతోంది. జగన్ ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. జగన్ సైతం ఈ సినిమా చూసి చాలా సంతోషించి ఉంటాడనడంలో సందేహం లేదు. ఐతే వైఎస్, జగన్‌ల మీద రెండు సినిమాలు తీసి మెప్పించిన మహికి జగన్ సర్కారు నుంచి కానుక అందుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒక ప్రముఖ తెలుగు పత్రిక మహికి జగన్ సర్కారు ఇస్తున్న తాయిలం గురించి ఈ రోజు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. స్టూడియో కడతానని మహి అప్లికేషన్ పెట్టుకోవడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాల ఖరీదైన స్థలాన్ని మహికి కట్టబెట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మహి అప్లికేషన్‌ను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. దీంతో ‘యాత్ర-2’ విడుదల రోజే ఆర్డీవో వెళ్లి స్థల పరిశీలన చేశారు. రెండు ఎకరాల ఆ స్థలం విలువ రూ.20 కోట్లని.. దాన్ని నామమాత్రపు ధరకు మహికి ఇవ్వబోతున్నారని.. ఈ మేరకు చకచకా ఫైల్స్ కదులుతున్నాయని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఐతే ఈ వార్తలపై మహి పరోక్షంగా స్పందిచాడు ట్విట్టర్లో. బురద చల్లడం మన పని కడుక్కుంటాడా, తుడుచుకుంటాడా అన్నది అవతలి వాడి ఇష్టం అంటూ తాను ‘యాత్ర-2’లో రాసిన డైలాగ్‌ను ఉటంకిస్తూ మీడియాపై విమర్శలు గుప్పించాడు మహి. ఈ ట్వీట్ చివర్లో తాను తన చివరి మూడు చిత్రాలను రాయలసీమలోనే తీసిన విషయాన్ని ప్రస్తావించాడు. దీన్ని బట్టి రాయలసీమకు తన సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని.. తనకు స్టూడియో కోసం స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే తప్పేంటని మహి పరోక్షంగా పేర్కొన్నట్లు అనిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో నిజానిజాలెంతో చూడాలి.
This post was last modified on February 11, 2024 11:12 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…