పెద్ద సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కు శకునాలు కలిసి వస్తున్నాయి. ఊరిపేరు భైరవకోన ఈ నెల 16 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రమోషన్ల స్పీడ్ పెంచేశాడు. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేస్తామని నిర్మాత ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముందు 14 రాత్రి ఓ యాభై అరవై షోలు వేద్దామనుకుంటే డిమాండ్ గమనించిన డిస్ట్రిబ్యూటర్లు వాటిని వందకు పైగా పెంచమని అడుగుతున్నారట. సరిపడా థియేటర్లు అందుబాటులో ఉండటంతో ఈ వెసులుబాటు బాగా కలిసి వచ్చేలా ఉంది.
సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూడు కలగలసిన ఊరి పేరు భైరవకోనకు స్పెషల్ షోల టాక్ చాలా కీలకంగా మారనుంది. సమర్పకుడు అనిల్ సుంకరతో పాటు నిర్మాత రాజేష్ దండా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ముందు రోజు సాయంత్రం షోలు వేయడం సహజమే కానీ మరీ రెండు రోజుల ముందు అంటే ఒకరకంగా రిస్కే. సామజవరగమనకు ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అయిన కారణంగా దీనికీ అదే ఫాలో అవుతున్నారు. దర్శకుడు విఐ ఆనంద్ ఇంటెన్స్ సబ్జెక్టుతో దీన్ని రూపొందించారు. ఎక్కడికి పోతావు చిన్నవాడాతో ఈ జానర్ మీద ఆయనకున్న పట్టు తెలిసిందే.
సంక్రాంతి తర్వాత యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా రాకపోవడం ఊరిపేరు భైరవకోనకు కలిసి వస్తోంది. ఈగల్ కు మూడు రోజుల రెవిన్యూ బాగుంది కానీ ఫైనల్ స్టేటస్ తేలాలంటే వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ ఊరిపేరు భైరవకోనకు బాగుందనే మాట బయటికి వస్తే కలెక్షన్ల పరంగా మంచి నెంబర్లు చూడొచ్చు. పైగా ఆపై వారం ఫిబ్రవరి 23 చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. తిరిగి మార్చి 1 దాకా స్లాట్స్ ఫ్రీగా ఉంటాయి. హిట్ అనిపించుకుంటే సందీప్ కిషన్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఎదురు చూస్తున్న విజయలక్ష్మి వరించినట్టే.
This post was last modified on February 11, 2024 11:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…