ప్రతి నటుడి కెరీర్లో కొన్ని ప్రతిష్ఠాత్మక సినిమాలు ఉంటాయి. వాటి కోసం ఎంతో కష్టపడతారు. చాలా సమయం పెడతారు. ఆ చిత్రాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిస్తే కుంగిపోతారు. ఆమిర్ ఖాన్ కెరీర్లో లాల్ సింగ్ చడ్డా అలాంటి సినిమానే. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఆమిర్ నిర్మాణంలో అతడి మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాకు ఆమిర్ అన్నీ తానై వ్యవహరించాడు. చాలా టైం తీసుకుని పెద్ద బడ్జెట్లో ఈ సినిమా చేశాడు. కానీ చివరికి తీవ్ర నిరాశ తప్పలేదు. విపరీతమైన నెగెటివిటీ మధ్య రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్ టాకే రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఆమిర్ పెట్టిన పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం అంతా వృథా అయిపోయింది.
ఈ ఫలితంతో తీవ్ర నిరాశ చెందిన ఆమిర్ కొంత కాలం సినిమాల ఊసే ఎత్తలేదు. ఈ మధ్యే తారే జమీన్ పర్ సీక్వెల్ సితారె జమీన్ పర్‌ను మొదలు పెట్టాడు. లాల్ సింగ్ చడ్డా ఆమిర్‌ను ఎంత బాధ పెట్టింది అతడి మాజీ భార్య కిరణ్ రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమిర్ మీద ఇప్పటిదాకా ఏ సినిమా చూపించనంత ప్రభావం ఈ మూవీ చూపించిందని ఆమె చెప్పింది. ఆమిర్ చాలా రోజులు ఈ ఫలితం గురించి మాట్లాడాడని చెప్పింది. లాల్ సింగ్ చడ్డా ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఆమె వెల్లడించింది. ఈ సినిమాకు అలాంటి ఫలితం వస్తుందని టీంలో ఎవ్వరూ ఊహించలేదని ఆమె చెప్పింది. తాము ఆ సినిమా వైఫల్యాన్ని అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు కిరణ్ తెలిపింది. కిరణ్‌తో వైవాహిక బంధం నుంచి బయటికి వచ్చినప్పటికీ.. ఆమెతో సినిమా బంధం మాత్రం కొనసాగిస్తున్నాడు ఆమిర్. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాపతా లేడీస్‌కు ఆమిరే నిర్మాత
This post was last modified on February 11, 2024 11:09 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని…
హీరోయిన్ లు అంటే... చాలా సున్నితంగా, సుకుమారంగా ఉంటారు. అయితేనేం... వారిలోని భక్తి ఒక్కోసారి వారి చేత వండర్లు చేయిస్తూ…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…