ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజైన అన్ని సినిమాల్లోకి చిన్న మూవీగా భావించారు హనుమాన్ను అందరూ. కానీ ఆ సినిమా ఈ సంక్రాంతికే కాదు.. మొత్తం సంక్రాంతి చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సరిపడా థియేటర్లు దొరక్క అనేక ఇబ్బందుల మధ్య రిలీజైన ఆ చిత్రం.. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి పండుగ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వసూళ్ల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
విడుదలై నెల రోజులు అవుతున్నా హనుమాన్ రన్ ముగియలేదు. రెండు వారాల పాటు హౌస్ ఫుల్స్‌తో నడిచి.. తర్వాతి రెండు వారాల్లోనూ ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోందీ సినిమా. ఈ వారం రిలీజైన కొత్త సినిమాలకు దీటుగా హనుమాన్ నిలుస్తుండడం విశేషం. దీంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు హనుమాన్ చిత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి.
హనుమాన్ ఏకంగా 300 స్క్రీన్లలో 30 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకోవడం విశేషం. శత దినోత్సవాలు, అర్ధశతదినోత్సవాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయి ఇప్పుడంతా రెండు మూడు వీకెండ్స్కే రన్ అయిపోతోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా నెల తిరిగేసరికి ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
మరో సంక్రాంతి సినిమా గుంటూరు కారం ఆల్రెడీ డిజిటల్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. కానీ హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్లలో బలంగా నిలుస్తోంది. ఇంకో రెండు మూడు వారాలు సినిమాకు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. దీంతో హనుమాన్ 50 రోజుల సెంటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ విషయంలోనూ హనుమాన్ రికార్డులు నెలకొల్పడం ఖాయం. తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా.. నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు
This post was last modified on February 11, 2024 11:06 pm
పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వేణుంబాకం…
తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి…
తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…
రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ స్థానిక నేతలు పన్నిన వ్యూహానికి టీడీపీ…
దేశంలో ప్రస్తుతం జాతీయ స్థాయిలో రెండు కూటములు కొనసాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూటములు ఉన్నాయి.…
ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిగిలిపోయిన కార్పొరేషన్ స్థానాలకు, అలానే మునిసిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో…