మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ తదితర పనులు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను లాక్ చేసి ఆల్రెడీ టీమ్ కి ఇచ్చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. జక్కన్న ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. హీరోయిన్లలో ఒకరిగా అమెరికాలో ఉండే ఇండోనేషియ నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ని ఎంపిక చేసినట్టు వచ్చిన లీక్ ఫ్యాన్స్ ని కుదిపేస్తోంది. ఆమె ఎవరంటూ ఆరా తీస్తున్నారు. ఆ వివరాలేంటో లుక్ వేద్దాం.
ఈ అమ్మాయి 2013లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్ట్రీట్ సొసైటీతో సక్సెస్ సాధించి క్రమంగా ఇండస్ట్రీలో కుదురుకుంది. అంతకు ముంచి 2005లో టీవీ యాడ్స్ ద్వారా నటనలో తెరంగేట్రం చేసింది. ప్రతిష్టాత్మకమైన సిట్రా అవార్డును రెండు సార్లు దక్కించుకుంది. 2016లో మయా, 2017లో ఇండోనేషియన్ మూవీ పురస్కారం గెలుచుకుంది. 2018లో మే ది డెవిల్ టేక్ యు పెద్ద విజయం సాధించి దాని సీక్వెల్ లోనూ భాగమయ్యేలా చేసింది. లోరియల్, గార్నియర్, ఒప్పో, రెక్సోనా, పిజ్జా హట్ లాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల యాడ్స్ లో మోడల్ గా నటించి పేరు తెచ్చుకుంది.
చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కి పదికి పైగా ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. మహేష్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో జరుగుతుంది కాబట్టి దానికి ఫారిన్ ఆర్టిస్టులు అవసరం. అందులో భాగంగానే ఈమెను లాక్ చేశారట. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇలాగే మంచి ఛాయస్ ని ఎంచుకున్న రాజమౌళి ఇప్పుడు మరోసారి తన అభిరుచిని బయట పెట్టుకోబోతున్నారు. టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాజెక్టు అనౌన్స్ చేయబోయే ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…