రవితేజకు మాస్ రాజా అని పేరు రావడానికి కారణం ఆయన ఎక్కువగా మాస్ మూవీస్‌తోనే ఘనవిజయాలు సాధించడం. కమర్షియల్ మసాలాల్ని బాగా దట్టించి మాస్ మూవీస్ తీస్తే ఆయన సినిమాలు వసూళ్ల మోత మోగిస్తుంటాయి. ఐతే ఎప్పుడూ రొటీన్ మాస్ సినిమాలే చేయడం భావ్యం కాదు అనిపించి రవితేజ.. ప్రయోగాత్మక పాత్రలు, కథలూ ట్రై చేస్తుంటాడు.
కాలంతో పాటు మనమూ మారాలనే ఉద్దేశంతో కొత్త కథలు పట్టుకొచ్చే దర్శకులను ప్రోత్సహిస్తుంటాడు. కానీ అదేం శాపమో కానీ.. రవితేజ రొటీన్‌కు భిన్నంగా ఏది ట్రై చేసినా సరైన ఫలితం రాదు. నా ఆటోగ్రాఫ్, సారొచ్చారు, డిస్కో రాజా లాంటి మంచి, ప్రయోగాత్మక సినిమాలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇవేవీ తీసిపడేయదగ్గ సినిమాలు కాదు. కానీ ఆ కథలు వేర్వేరు కారణాల వల్ల వర్కవుట్ కాలేదు.
రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర లాంటి సినిమాలంటే మరీ పేలవంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రయోగాల విషయంలో రవితేజ చింతించాల్సిన పని లేదు. కానీ కొన్ని మంచి కథలు కూడా వర్కవుట్ కాలేదు. రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఈగల్’ కూడా కంటెంట్ ఉన్నదే. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని భిన్నమైన స్క్రీన్ ప్లే.. హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దాడు.
ఇందులో యాక్షన్ ఘట్టాలకు పేరు పెట్టాల్సిన పని లేదు. వాటిని అద్భుతంగా మలిచాడు. కానీ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం.. నరేషన్ మరీ స్లోగా ఉండడం.. డైలాగులు సింక్ కాకపోవడం.. మైనస్ అయి సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ సినిమా అంటే కొంచెం హడావుడిగా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఇది డల్లుగా సాగడం ప్రతికూలమైంది.
కేవలం యాక్షన్ సన్నివేశాలను నమ్ముకుని సినిమాను లాగించేశారని.. సినిమాలో ఇంకొంచెం వేగం, ఎంటర్టైన్మెంట్ ఉంటే ఫలితం వేరేలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ రవితేజ కొత్తగా ట్రై చేసిన మరో సినిమాకు నిరాశాజనక ఫలితమే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2024 10:05 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…