నా సామిరంగ సక్సెస్ తో ఊపుమీదున్న నాగార్జున వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ డ్రామా ఆల్రెడీ షూటింగ్ లో ఉంది..రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది కాకుండా తమిళ దర్శకుడు నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త తెలిసిందే. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించే ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ని వేసవిలోగానే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకో ప్రాజెక్టు కోసం దర్శకుడు సుబ్బుకి నాగ్ ఎస్ చెప్పినట్టు తెలిసింది.
కోర్ట్ రూమ్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో ప్రియమణిని ఎంపిక చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నారట. ఈ జోడి గతంలో రగడ చేసిన సంగతి గుర్తే. 2010లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ప్రియమణికి తగిన ప్రాధాన్యంతో పాటు కింగ్ తో ఆడిపాడే పాటలు దక్కాయి. ఇటీవలే మలయాళం బ్లాక్ బస్టర్ నేరులో నటించాక ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రైమ్ లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బ్రేక్ ఇచ్చినప్పటికీ గత రెండేళ్లుగా మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి..
ఇక నాగార్జున విషయానికి వస్తే బంగార్రాజు 3 చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఎంతమేరకు కార్యరూపం దాలుస్తుందో స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దర్శకత్వం కళ్యాణ్ కృష్ణనే చేస్తారా లేదా అనే క్లారిటీ కూడా రావాల్సి ఉంది. నా సామిరంగ కాకుండా ఈ ఏడాది ఇంకో రిలీజ్ ఉండేలా చూస్తున్నారు. ఎంతమేరకు సాధ్యమవుతుందో ఇప్పుడే చెప్పలేం. ముందు జాగ్రత్త చర్యగా సంక్రాంతికో కర్చీఫ్ అయితే వేసి పెట్టారు కానీ ఆయన చేసే వాటిలో ఏదో వస్తుందో మాత్రం ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే మొదలుపెట్టొచ్చట కానీ ఈసారి నాగ్ చేయకపోవచ్చని టాక్.
This post was last modified on February 11, 2024 9:46 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…