Movie News

చిరంజీవి రజనీకాంత్ ఇద్దరికీ ఒకే పాఠం

గత ఏడాది భోళా శంకర్ డిజాస్టర్ ఫలితం చిరంజీవిలో తీవ్ర ఆత్మ పరిశీలనకు ప్రేరేపించింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అభిమానులు ఎగబడి చూస్తారనే భ్రమలను పూర్తిగా తొలగించిన కళాఖండమది. రిలీజ్ రోజు ఉదయం బెనిఫిట్ షోలు సైతం చాలా చోట్ల ఫుల్ కాలేదంటేనే ఫ్యాన్స్ దాని పట్ల ఎంత అనాసక్తిగా ఉన్నారో ట్రేడ్ కి అర్థమైపోయింది. దెబ్బకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ప్లాన్ చేసుకున్న సినిమాని మెగాస్టార్ ఉన్నఫళానా ఆపేశారు. కాస్త లేట్ గా అనుకున్న విశ్వంభరని ముందుకు తెచ్చి ఏడాది సమయం కేటాయించేందుకు సిద్ధపడ్డారు. ఇదో గొప్ప పాఠం.

అచ్చం ఇదే పరిస్థితి సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చింది. నిన్న విడుదలైన లాల్ సలామ్ ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ అంటే ఏమో అనుకోవచ్చు తమిళనాడులోనూ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదని కలెక్షన్లు తేటతెల్లం చేస్తున్నాయి. ఏపీ తెలంగాణలో పలు చోట్ల నెగటివ్ షేర్లు నమోదైనట్టు తెలిసింది. జైలర్ వచ్చి పట్టుమని తొమ్మిది నెలలు కాలేదు. రెండు వారాలు సులభంగా టికెట్లు దొరకని రేంజ్ లో అది బ్లాక్ బస్టరయ్యింది. కనీసం దాని ప్రభావం ఉన్నా లాల్ సలామ్ కి ఈ దుస్థితి ఉండేది కాదు. ఆడియన్స్ స్టార్ డం కన్నా కంటెంట్ వైపే చూస్తున్నారని వేరే చెప్పాలా.

ఇదంతా చూసి తలైవర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. కూతురు ఐశ్వర్య మీద నమ్మకం, ప్రేమతో రజినీకాంత్ కథని పూర్తిగా విశ్లేషించుకోకుండా ఓకే చేశారని, దాని వల్ల ఇప్పుడీ ఓపెనింగ్ తో తల దించుకునే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో వాపోతున్నారు. పోనీ డివైడ్ టాక్ వచ్చినా ఏదోలే అనుకోవచ్చు. కానీ రివ్యూలు, పబ్లిక్ టాక్ అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. విడుదలకు ముందు నుంచే బజ్ విషయంలో బాగా వెనుకబడిన లాల్ సలామ్ నిర్మాణ సంస్థ లైకాని ముంచేదేమి లేదు కానీ రజని ఇమేజ్ పరంగా జరిగిన డ్యామేజ్ మాత్రం కొద్దిరోజులు వెంటాడుతూనే ఉంటుంది.

This post was last modified on February 10, 2024 12:51 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago