ఫిబ్రవరి 9 ఓటిటి లవర్స్ కి మాములు పండగలా లేదు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల హడావిడితో ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. కేవలం ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ లో ‘గుంటూరు కారం’ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి తేవడం థియేటర్ లో మిస్ చేసుకున్న ఆడియన్స్ కి కనువిందు చేయనుంది. ధనుష్ పీరియాడిక్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో డీసెంట్ గా ఆడినా తెలుగులో డిజాస్టర్ అయ్యింది. అలా అని మరీ బ్యాడ్ మూవీ కాదు కాబట్టి డిజిటల్ లో చూసే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రధాన భాషల్లో అందుబాటులోకి తేబోతున్నారు.
శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ సన్ నెక్స్ట్ లో వచ్చేస్తోంది. కేవలం తమిళంలో మాత్రమే ఉంటుందా లేక ఇక్కడ రిలీజ్ ఆలస్యమైన తెలుగు ఆడియో కూడా ఇస్తారా అనేది సస్పెన్స్ గానే ఉంది. స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల డెబ్యూ మూవీ ‘బబుల్ గమ్’ని ఆహా తీసుకొస్తోంది. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి భూమి పెడ్నేకర్ ‘భక్షక్’ మీద మంచి అంచనాలున్నాయి. ట్రైలర్ ఆకర్షణీయంగా అనిపించింది. మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం చేస్తున్న టాక్ షో ‘ఉస్తాద్’లో శర్వానంద్ గెస్ట్ గా వస్తున్నాడు. సుస్మిత సేన్ ‘ఆర్య సీజన్ 3’ని హాట్ స్టార్ పబ్లిక్ ముందు తీసుకొస్తుంది.
ఇక్కడ చెప్పినవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే. ఇలా చెప్పుకుంటూ ఇంకో పది దాకా వివిధ బాషల క్రేజీ మూవీస్ లిస్టులో ఉన్నాయి. థియేటర్లకు వందలు ఖర్చు పెట్టి ఏం వెళతాంలే అనుకునే వాళ్లకు కాలు కదపకుండానే ఇన్ని ఆప్షన్లు ఉంటే ఇక టికెట్లు కొని వెళ్లాలన్న ఉత్సాహం ఏమొస్తుంది. పైగా రవితేజ ఈగల్ కు తప్ప మిగిలిన థియేటర్ రిలీజుల మీద అంత ఆసక్తి కనిపించడం లేదు. లాల్ సలామ్, ట్రూ లవర్ పూర్తిగా టాక్ మీద ఆధారపడ్డాయి. యాత్ర 2 మొదటి భాగం రేంజ్ లో వెళ్లకపోవచ్చనే రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఇంట్లో కాలక్షేపానికి లోటు లేకుండా ఓటిటిలు చేసేస్తున్నాయి.
This post was last modified on February 9, 2024 9:59 am
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ…
కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు.…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు…
ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా…
పట్టుబట్టారు.. సాధించారు. ఈ మాటకు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ సహా.. నారా లోకే ష్ కూడా…