నేచురల్ స్టార్ నాని సినిమా ఎంపిక ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అతను ఎంచుకునే కథలు, దర్శకులు అంచనాలను దాటి ఉంటాయి. గత ఏడాది శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా లాంటి ఊర మాస్ సినిమా తర్వాత.. శౌర్యువ్ అనే మరో డెబ్యూ డైరెక్టర్‌తో హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీ చేసి మెప్పించాడు నాని. ప్రస్తుతం నాని.. ‘అంటే సుందరానికీ’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు.
ఇది కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ చిత్రం తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్సుగానే ఉంది. శైలేష్ కొలనుతో ‘హిట్-3’తో పాటు సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో నాని జట్టు కడతాడని వార్తలు వచ్చాయి.
ఐతే ఈ సినిమాలో భవిష్యత్తులో ఉండొచ్చు కానీ.. వాటి కంటే ముందు నాని ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట. నాని-వేణుల కలయికలోనూ సినిమా ఉండొచ్చని గతంలోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సినిమా లాక్ అయినట్లు సమాచారం. వేణు తాజాగా కథ నరేట్ చేయగా.. దాన్ని ‘సరిపోదా శనివారం’ తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట.
వేణుతో ‘బలగం’ తీసిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. నానికి దిల్ రాజు బేనర్లో ‘ఎంసీఏ’ లాంటి పెద్ద హిట్ ఉంది. ‘బలగం’ ఫ్లూక్ హిట్ అన్న వాళ్లకు వేణు ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తనేంటో రుజువు చేయాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on February 8, 2024 5:53 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…