బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చినప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పుడైతే దేవర ఒప్పుకుందో అప్పటి నుంచి దశ తిరుగుతున్నట్టే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరైతే బాగుంటారోనని వెతికి మరీ ఈమెను లాక్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ ఇప్పటిదాకా చేసిన షూటింగ్ లో ఆమె పెర్ఫార్మన్స్ పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నాడట. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఆర్సి 16లోనూ తననే తీసుకునే అవకాశాలున్నట్టు ఆల్రెడీ టాక్ మొదలైంది. తారక్ ఫీడ్ బ్యాక్ విన్నాకే చరణ్ టీమ్ సీరియస్ గా ఆలోచిస్తోందని వినికిడి.
ఇదే కాదు హిందీలో మూడు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో నితీష్ తివారి తీయబోయే రామాయణంలోనూ తనకు కీలక పాత్ర ఆఫర్ చేసినట్టు ముంబై టాక్. నిజానికి సీత క్యారెక్టరే ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కానీ ముందు అనుకున్న సాయిపల్లవి ఎస్ చెప్పిందో నో చెప్పిందో ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ ఒప్పుకుని ఉంటే జాన్వీ కపూర్ కి ఎలాంటి పాత్ర ఇచ్చారనేది సస్పెన్స్ గా ఉండబోతోంది. నితీష్ డైరెక్షన్ లో జాన్వీ గతంలో బవాల్ చేసింది. తాజాగా ఆయన ఆఫీస్ దగ్గర కనిపించడంతో లుక్ టెస్ట్ కోసమేననే ఊహాగానాలు మొదలైపోయాయి. కన్ఫర్మ్ అయితే కాలేదు.
చూస్తుంటే జాన్వీ కపూర్ గుడ్ టైం మొదలైనట్టే ఉంది. దేవర రెండు భాగాలు కాబట్టి అది కనక బ్లాక్ బస్టర్ అయితే ఒక్కసారిగా జాతకం మారిపోయింది. ఇంకోవైపు రామ్ చరణ్ ప్రొజెక్టు ఓకే అయితే జాక్ పాట్ కొట్టినట్టే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హిందీలో స్టార్ హీరోల సరసన ఆఫర్లు రాక ఎక్కువ ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తున్న జాన్వీ కపూర్ కి సరైన బ్రేక్ తెలుగులోనే దక్కేలా ఉంది. ఏప్రిల్ లో రిలీజవ్వాల్సిన దేవర 1 వాయిదా పడటంతో కొంత నిరాశ పడినా ఈ ఏడాది వచ్చి తీరుతుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఇందులో సముద్ర తీరంలో తిరిగే బెస్తల పిల్లగా నటిస్తోంది.
This post was last modified on February 7, 2024 7:44 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…