Movie News

రెమ్యూన‌రేష‌న్‌పై ర‌ష్మిక కామెడీ

స్టార్ హీరోలు, హీరోయిన్ల పారితోష‌కాల గురించి మీడియాలో, సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. ఒక పెద్ద హిట్ ప‌డ‌గానే పారితోష‌కాలు పెరిగిపోయిన‌ట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని కేవ‌లం ఊహాగానాలుగానే ఉంటాయి.

ఇటీవ‌లే సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ మూవీ యానిమ‌ల్‌తో ఘ‌న‌విజ‌యాన్నందుకుంది. దీంతో ఆమె రెమ్యూన‌రేష‌న్ ఒక్క‌సారిగా పెరిగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆమె పారితోష‌కంగా 4 కోట్లు దాటిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌య‌మై ర‌ష్మిక స‌రదాగా స్పందించింది. త‌న పారితోష‌కం గురించి మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను తాను సీరియ‌స్‌గా తీసుకోవాల‌నుకుంటున్న‌ట్లు ఆమె వ్యాఖ్యానించ‌డం విశేషం.

నేను పారితోష‌కం పెంచాన‌ని ఎవ‌రు చెప్పారు. ఈ వార్త‌లు చూసి ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. ఐతే ఈ విష‌యాన్ని నేను క‌న్సిడ‌ర్ చేయాల‌నుకుంటున్నా. రెమ్యూనరేష‌న్ ఎందుకు పెంచార‌ని నిర్మాత‌లు ఎవ‌రైనా అడిగితే.. మీడియా అలానే చెప్పింది కాబ‌ట్టి దానికే క‌ట్టుబ‌డాల‌నుకుంటున్న‌ట్లు చెబుతా అంటూ స్మైల్ ఎమోజీలు జోడించి కామెంట్ చేసింది ర‌ష్మిక‌.

మ‌రోవైపు ర‌ష్మిక రెస్పాన్స్ చూసి నిర్మాత ఎస్కేఎన్ కూడా స‌ర‌దాగా స్పందించాడు. ర‌ష్మిక‌తో తాము తీస్తున్న గ‌ర్ల్ ఫ్రెండ్ మూవీని ఈ ఆర్టిక‌ల్ రావ‌డానికి ముందే మొద‌లు పెట్ట‌డం సంతోషంగా ఉంద‌ని అత‌ను వ్యాఖ్యానించాడు. ఈ జోక్స్ ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో ర‌ష్మిక ఒక‌రు. ఆమె ఈ ఏడాది పుష్ప‌-2 లాంటి భారీ మూవీతో రాబోతోంది. ఇంకో అర‌డ‌జ‌ను దాకా సినిమాలు త‌న చేతిలో ఉన్నాయి.

This post was last modified on February 7, 2024 8:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

50 minutes ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

5 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

10 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

11 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

11 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

12 hours ago